రెండో సెమీస్‌.. కాసేపట్లో ఆసీస్, ఇంగ్లండ్ ఢీ

Thu,July 11, 2019 01:50 PM

australia and england semi final match to start soon

బర్మింగ్‌హామ్: మరో రసవత్తర సమరాన్ని ఆస్వాదించేందుకు క్రికెట్ ప్రపంచం సిద్ధమైంది. ప్రపంచకప్ రారాజు ఆస్ట్రేలియా.. ఆతిథ్య ఇంగ్లండ్ మధ్య ఎడ్జ్‌బాస్టన్ వేదికగా రెండో సెమీఫైనల్ కాసేపట్లో ప్రారంభం కానుంది. విశ్వటోర్నీ చరిత్రలో ఇంతవరకు సెమీస్‌కు వెళ్లిన ఏడు సార్లూ అజేయంగా నిలవడం సహా ఐదు టైటిళ్లు సాధించిన ఆస్ట్రేలియాను... ఒక్కసారి కూడా కప్పును ముద్దాడలేకపోయిన ఇంగ్లండ్ ఢీ కొననుంది.

ప్రపంచకప్ కలను సొంతగడ్డపై సాకారం చేసుకునేందుకు చిరకాల ప్రత్యర్థి ఆసీస్‌ను ఎలాగైనా ఓడించి తుదిపోరులో అడుగుపెట్టాలని మోర్గాన్ సేన పట్టుదలగా ఉంది. మరోవైపు ఆరో టైటిల్‌పై కన్నేసిన ఆస్ట్రేలియా మాత్రం లీగ్‌దశలో చిత్తుచేసినట్టే సెమీస్‌లోనూ ఇంగ్లిష్ జట్టును మట్టికరిపించి తుదిపోరులో ప్రవేశించాలని కంకణం కట్టుకుంది. ఇవాళ జరిగే మ్యాచ్ తో ఫైనల్ లో న్యూజిలాండ్ ప్రత్యర్థి ఎవరో తేలిపోనుంది.

1229
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles