అందుకే అంత సడెన్‌గా రిటైర్మెంట్ ప్రకటించాను!

Sun,August 19, 2018 12:48 PM

కేప్‌టౌన్: సౌతాఫ్రికా మాజీ కెప్టెన్ ఏబీ డివిలియర్స్ నాలుగు నెలల కిందట రిటైర్మెంట్ ప్రకటించిన సంగతి తెలుసు కదా. ఎవరూ ఊహించని విధంగా ఏబీ సడెన్‌గా తన నిర్ణయాన్ని ప్రకటించి షాక్‌కు గురిచేశాడు. 114 టెస్టులు, 228 వన్డేలు, 78 టీ20లు ఆడిన డివిలియర్స్.. కనీసం వచ్చే ఏడాది వరల్డ్‌కప్ వరకైనా ఆడతారని చాలా మంది భావించారు. అయితే తన రిటైర్మెంట్‌కు అప్పట్లో కచ్చితమైన కారణం చెప్పని ఏబీ.. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆ విషయాన్ని వెల్లడించాడు. బాగా రాణించాలన్న ఒత్తిడిని తాను భరించలేకపోయానని ఈ సందర్భంగా అతడు చెప్పాడు. అభిమానుల అంచనాలు భారీగా ఉన్నాయని, అంతటి అటెన్షన్‌ను తాను తట్టుకోలేకపోయానని డివిలియర్స్ అన్నాడు.

ఈ ఏడాది ఏప్రిల్‌లో ఆస్టేలియాతో తన చివరి టెస్ట్ మ్యాచ్‌ను ఆడిన ఏబీ.. సిరీస్ ముగియగానే రిటైర్మెంట్ ప్రకటించాడు. కెరీర్ చివరి రోజుల్లో వరుస గాయాలతోపాటు ఫామ్ కోల్పోయి అతను సతమతమయ్యాడు. క్రికెట్‌ను తాను చాల్ మిస్ అవుతున్నా.. తన నిర్ణయంపై మాత్రం ఎప్పుడూ చింతించలేదని ఏబీ స్పష్టంచేశాడు. క్రికెట్ నుంచి తప్పుకొని కుటుంబంతో గడపటం చాలా సంతోషంగా ఉందని అన్నాడు. 2004లో సౌతాఫ్రికా టీమ్ తరఫున ఏబీ డిలియర్స్ అరంగేట్రం చేశాడు. అప్పటి నుంచి టెస్టుల్లో 8765 పరుగులు, వన్డేల్లో 9577 పరుగులు, టీ20ల్లో 1672 పరుగులు చేశాడు. టెస్టులు, వన్డేల్లో 50కిపైగా సగటు సాధించాడు.

5646
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles