మీరు సపోర్ట్ ఇచ్చి ఉంటే గోల్డ్ మెడల్ గెలిచేదాన్ని!

Wed,September 5, 2018 03:34 PM

Asian Games Wrestler Divya Kakran slams Aravind Kejriwal Government

న్యూఢిల్లీ: ఏషియన్ గేమ్స్‌లో బ్రాంజ్ మెడల్ గెలిచిన రెజ్లర్ దివ్య కక్రన్.. ఢిల్లీలోని కేజ్రీవాల్ ప్రభుత్వాన్ని కడిగిపారేసింది. తన సన్మాన కార్యక్రమం సందర్భంగా కేజ్రీవాల్‌తోపాటు ఇతర ప్రభుత్వ ఉన్నతాధికారులందరి ముందే ఆమ్ ఆద్మీ సర్కార్ తీరుపై మండిపడింది. ప్రభుత్వం నుంచి సరైన మద్దతు లభించి ఉంటే.. బ్రాంజ్ కాదు కదా గోల్డ్ మెడల్ గెలిచేదాన్ని అని కేజ్రీవాల్ మొహం మీదే చెప్పేసింది. నేను కామన్వెల్త్ గేమ్స్‌లో మెడల్ గెలిస్తే ప్రభుత్వం నుంచి కావాల్సిన సంపూర్ణ మద్దతు ఇస్తామని మీరు నాకు మాట ఇచ్చారు. కానీ మద్దతు కాదు కదా కనీసం ఫోన్ కాల్స్ కూడా పట్టించుకోలేదు అని కేజ్రీవాల్‌ను దివ్య నిలదీసింది. మీరు ఇవాళ మమ్మల్ని సన్మానిస్తున్నారు. కానీ అథ్లెట్లుగా మారుదామని అనుకుంటున్న పేద పిల్లల గురించి ఓసారి ఆలోచించండి. ఇప్పుడు మెడల్స్ గెలిచామని మమ్మల్ని సన్మానిస్తున్నారు. మాకు మీ మద్దతు అవసరమైనప్పుడు మాత్రం ఎవరూ పట్టించుకోలేదు. మీరు అప్పుడే మాకు సాయం చేసి ఉంటే.. మేం గోల్డ్ మెడల్ గెలిచేవాళ్లం అని దివ్య స్పష్టంచేసింది.

అయితే దీనిపై కేజ్రీవాల్ కూడా వెంటనే స్పందించారు. కేంద్ర ప్రభుత్వం చేస్తున్న రాజకీయాల వల్లే తాము అనుకున్న పథకాలను సరిగా అమలు చేయలేకపోతున్నామని చెప్పారు. మేం చేసే ప్రతి పనికి అడ్డుపడుతున్నారు అని నువ్వు పేపర్లలో చదివే ఉంటావు. నువ్వు చెప్పేది నిజమే. చాలా మంది అథ్లెట్లు కూడా ఇదే అంటున్నారు. కానీ ఇప్పటివరకు మేం రూపొందించిన విధానాలన్నింటినీ పైస్థాయిలో ఉన్న వ్యక్తులు కావాలని పక్కన పడేశారు. ఇప్పుడు సుప్రీంకోర్టు ఆదేశాల మేరకే సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేశాం అని కేజ్రీవాల్ అన్నారు.

2320
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS