ఆసియా కప్.. దుబాయ్‌లో టీమిండియా

Fri,September 14, 2018 02:05 PM

Asia Cup 2018 India team leaves for Dubai

అబుదాబి: ఇంగ్లాండ్‌లో సుదీర్ఘ పర్యటనను ముగించుకున్న టీమిండియా మరో పోరాటానికి సిద్ధమైంది. యూఏఈ వేదికగా జరగనున్న ఆసియా కప్‌లో తలపడే భారత జట్టు గురువారం సాయంత్రం దుబాయ్ వెళ్లింది. రెగ్యులర్ కెప్టెన్ విరాట్ కోహ్లీకి విశ్రాంతిని ఇవ్వడంతో భారత జట్టుకు హిట్‌మ్యాన్ రోహిత్ శర్మ నాయకత్వం వహిస్తున్నాడు. కొంత మంది ఆటగాళ్లు ఇంగ్లాండ్‌లో తీరికలేకుండా మ్యాచ్‌లు ఆడిన నేపథ్యంలో వారంతా రెండు రోజుల విరామం అనంతరం సెప్టెంబర్ 16న దుబాయ్ వెళ్లనున్నారు. మాజీ సారథి మహేంద్రసింగ్ ధోనీ, అంబటి రాయుడు, మనీష్ పాండే, కేదార్ జాదవ్, కుల్దీప్ యాదవ్, యుజువేంద్ర చాహల్, భువనేశ్వర్ కుమార్, ఖలీల్ అహ్మద్ దుబాయ్ చేరిన వారిలో ఉన్నారు.

ఇంగ్లాండ్‌తో టెస్టు సిరీస్‌లో పాల్గొన్న కేఎల్ రాహుల్, శిఖర్ ధావన్, జస్ప్రిత్ బుమ్రా, హార్దిక్ పాండ్య, దినేశ్ కార్తీక్, శార్దుల్ ఠాకూర్, హెడ్ కోచ్ రవిశాస్త్రి, కోచింగ్ సిబ్బంది సెప్టెంబర్ 16న రోహిత్‌సేనతో కలవనున్నారు. దుబాయ్‌లోని ఐసీసీ అకాడమీలో భారత జట్టు ప్రాక్టీస్ చేయనుంది. పరిమిత ఓవర్ల క్రికెట్ ఆడి దాదాపు నెల రోజులు కావొస్తున్నందున వైట్‌బాల్‌తో నెట్స్‌లో సాధన చేయనున్నారు.

View this post on Instagram

Enroute Dubai✈️ @mahi7781 bhai.

A post shared by Kuldeep Yadav 🇮🇳 (@kuldeep_18) on

4366
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles