న్యూజిలాండ్‌తో టీ20 తర్వాత క్రికెట్‌కు నెహ్రా గుడ్‌బై

Wed,October 11, 2017 05:41 PM

Ashish Nehra to retire from Cricket after T20 with New Zealand in New Delhi

న్యూఢిల్లీ: టీమిండియా వెటరన్ బౌలర్ ఆశిష్ నెహ్రా న్యూజిలాండ్‌తో జరిగే టీ20 సిరీస్ తర్వాత క్రికెట్ నుంచి రిటైర్ కానున్నాడు. ఇప్పటికే ఈ విషయాన్ని అతను టీమ్ మేనేజ్‌మెంట్‌కు చెప్పాడు. నవంబర్ 1న ఈ మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్ నెహ్రా సొంతగడ్డ ఢిల్లీలో జరగనుండటంతో అక్కడే క్రికెట్ నుంచి తప్పుకోవాలని నెహ్రా నిర్ణయించుకున్నాడు. ఇప్పటికే కోచ్ రవిశాస్త్రి, కెప్టెన్ కోహ్లికి తన రిటైర్మెంట్ విషయాన్ని నెహ్రా చెప్పినట్లు బీసీసీఐ అధికారి ఒకరు వెల్లడించారు. ఆ మ్యాచ్‌లో తనకు అవకాశం కల్పించాలని నెహ్రా కోరినట్లు సమాచారం. ఎప్పుడో 1999లోనే అజారుద్దీన్ కెప్టెన్‌గా ఉన్న సమయంలో నెహ్రా టీమిండియాలోకి అడుగుపెట్టాడు. ఇన్నేళ్లలో అతడు 17 టెస్టులు, 120 వన్డేలు, 26 టీ20లు మాత్రమే ఆడాడు. 44 టెస్ట్ వికెట్లు, 157 వన్డే వికెట్లు, 34 టీ20 వికెట్లు తీసుకున్నాడు. 2011 వరల్డ్‌కప్ గెలిచిన టీమ్‌లో నెహ్రా సభ్యుడిగా ఉన్నాడు. అయితే గాయం కారణంగా ఫైనల్ ఆడలేకపోయాడు. రిటైర్మెంట్ తర్వాత అతన్ని తమ బౌలింగ్ కోచ్‌గా నియమించుకోవడానికి కొన్ని ఐపీఎల్ ఫ్రాంచైజీలు సిద్ధంగా ఉన్నట్లు సమాచారం. 38 ఏళ్ల వయసులో ఆస్ట్రేలియాతో టీ20 సిరీస్‌కు అతన్ని ఎంపిక చేయడంపై విమర్శలు కూడా చెలరేగిన విషయం తెలిసిందే.

3401
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles