పాక్ మాజీ కెప్టెన్‌కు అరెస్ట్ వారెంట్Wed,January 11, 2017 11:44 AM
పాక్ మాజీ కెప్టెన్‌కు అరెస్ట్ వారెంట్

క‌రాచీ: పాకిస్థాన్ మాజీ కెప్టెన్ వ‌సీం అక్ర‌మ్‌కు అరెస్టు వారెంట్ జారీ చేసింది స్థానిక సెష‌న్స్ కోర్టు. గ‌త ఏడాది జ‌రిగిన రోడ్డు ప్ర‌మాదంలో క్రికెట‌ర్ వ‌సీం స్థానిక రిటైర్డ్ మేజ‌ర్ అమినుర్ రెహ్మాన్‌పై పోలీసుల‌కు ఫిర్యాదు చేశాడు. అయితే ఆ కేసులో వ‌సీం కోర్టు విచార‌ణ‌కు ఇప్ప‌టి వ‌ర‌కు హాజ‌రుకాలేదు. దాదాపు 31 సార్లు కోర్టులో ఆ కేసు కోర్టు విచార‌ణ‌కు వ‌చ్చింది. క్రికెట‌ర్ అక్రం గైర్హాజ‌రు కావ‌డంతో ఆ కేసులో కోర్టు అత‌నికి బెయిల‌బుల్ వారెంట్‌ను జారీ చేసింది. గ‌త ఏడాది జ‌రిగిన ఘ‌ట‌న‌లో అక్రం మెర్సిడీజ్ కారును మాజీ మేజ‌ర్ ఢీకొట్టాడు. ఇద్ద‌రి మ‌ధ్య చెల‌రేగిన ఘ‌ర్ష‌ణ‌లో ఆ మేజ‌ర్ త‌న రివ్వాల‌ర్ తీసి కూడా బెదిరించాడు. అయితే కొంద‌రు పెద్ద‌లు ఇద్ద‌రి మ‌ధ్య రాజీ కుద‌ర్చ‌డంతో ఎవ‌రూ కోర్టుకు హాజ‌రుకావ‌డం లేదు. ఈ కేసులో జ‌న‌వ‌రి 17న క‌చ్చితంగా అక్రం విచార‌ణ‌కు హాజ‌రుకావాల‌ని కోర్టు ఆదేశించింది. ప్ర‌స్తుతం బౌలింగ్ కోచ్ అక్రం తమ జాతీయ జట్టుతో ఆస్ట్రేలియా టూర్‌లో ఉన్నాడు.

882
data-page-url = "https://www.ntnews.com/about-us.aspx">
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS