ఇంగ్లండ్ బ్యాట్స్‌మ‌న్‌ను బెంబేలెత్తించిన అర్జున్ టెండూల్క‌ర్‌

Thu,July 6, 2017 03:40 PM

Arjun Tendulkars Yorker Sends England Batsman Johny Bairstow Limping Out Of Nets

లండ‌న్‌: మాస్ట‌ర్ బ్లాస్ట‌ర్ స‌చిన్ టెండూల్క‌ర్ త‌న‌యుడు అర్జున్ టెండూల్క‌ర్ త‌న బౌలింగ్‌తో ఇంగ్లండ్ బ్యాట్స్‌మ‌న్ జానీ బెయిర్‌స్టోను బెంబేలెత్తించాడు. సౌతాఫ్రికాతో టెస్ట్ సిరీస్ సంద‌ర్భంగా లార్డ్స్ గ్రౌండ్‌లోని నెట్స్‌లో ప్రాక్టీస్ చేస్తున్న ఇంగ్లండ్ టీమ్‌కు అర్జున్ బౌలింగ్ చేశాడు. ఈ సంద‌ర్భంగా ఈ లెఫ్టామ్ పేస్ బౌల‌ర్ విసిరిన ఓ యార్క‌ర్‌.. బెయిర్ స్టో పాదానికి బ‌లంగా త‌గిలింది. దీంతో అత‌ను వెంట‌నే నెట్స్ వ‌ద‌లి వెళ్లిపోయాడు. వేళ్ల‌కు ఏమైనా ఫ్రాక్చ‌ర్ అయిందేమో అన్న ఉద్దేశంతో బెయిర్ స్టోను కాసేపు అబ్జ‌ర్వేష‌న్‌లో ఉంచారు. అయితే గాయం అంత తీవ్ర‌మైంది కాక‌పోవ‌డంతో అంతా ఊపిరి పీల్చుకున్నాడు. అత‌డు ఇవాళ సౌతాఫ్రికాతో మొదలైన తొలి టెస్ట్‌లో ఆడుతున్నాడు. ఇంగ్లండ్ టీమ్‌తో క‌లిసి నెట్స్‌లో ప్రాక్టీస్ చేయ‌డం అర్జున్‌కు ఇది తొలిసారి కాదు. లార్డ్స్ గ్రౌండ్ ద‌గ్గ‌ర్లోనే స‌చిన్‌కు ఓ ఇల్లుంది. దీంతో అక్క‌డున్న‌ప్పుడ‌ల్లా అర్జున్ నెట్స్‌లోకి వెళ్లి ఇంగ్లండ్ టీమ్‌తో క‌లిసి ప్రాక్టీస్ చేస్తాడు.

7180
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles