అర్జున్ అదిరే అరంగేట్రం.. 12వ బంతికే వికెట్

Tue,July 17, 2018 02:42 PM

Arjun Tendulkar takes a wicket of his 12th delivery in his maiden under 19 game for India

కొలంబో: లెజెండరీ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ తనయుడు అర్జున్ టెండూల్కర్ తన అండర్ 19 క్రికెట్ అరంగేట్రంలో అదరగొట్టాడు. శ్రీలంక అండర్ 19 టీమ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో తాను వేసిన 12వ బంతికే అండర్ 19 క్రికెట్‌లో తొలి వికెట్ తీశాడు. ఈ లెఫ్టామ్ ఫాస్ట్ బౌలర్ తన రెండో ఓవర్ చివరి బంతికి లంక బ్యాట్స్‌మన్ కామిల్ మిషారాను ఎల్బీడబ్ల్యూగా ఔట్ చేశాడు. అంతకుముందు లంక కెప్టెన్ నిపున్ ధనంజయ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్నాడు. ఇండియన్ టీమ్ కెప్టెన్ అనూజ్ రావత్.. అర్జున్ టెండూల్కర్‌తో బౌలింగ్ ప్రారంభించాలని నిర్ణయించాడు. తన రెండో ఓవర్ ఐదో బంతికి ఓ ఫోర్ ఇచ్చిన అర్జున్.. చివరి బంతికి వికెట్ తీశాడు. ఈ గుడ్ లెంగ్త్ డెలివరీ సడెన్‌గా లోపలికి దూసుకురావడంతో మిషారా వికెట్ల ముందు దొరికిపోయాడు. అర్జున్ తన తొలి స్పెల్‌లో 18 పరుగులు ఇచ్చి ఒక వికెట్ తీశాడు.


6078
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS