స్టేడియం కాంప్లెక్స్‌లోనే ఉంటున్న అర్జున్ టెండూల్కర్

Sat,April 28, 2018 07:22 PM

Arjun Tendulkar sweats it out in Dharamshala

ధర్మశాల: మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ తనయుడు అర్జున్ టెండూల్కర్ ధర్శశాలలోని నేషనల్ క్రికెట్ అకాడమీలో ఏర్పాటు చేసిన ప్రత్యేక శిక్షణ శిబిరంలో కఠోర సాధన చేస్తున్నాడు. వచ్చే నెల మొదటి వారంలో సచిన్ కూడా ట్రైనింగ్ సెషన్‌ను సందర్శించే అవకాశముందని సమాచారం. యువ క్రికెటర్ల కోసం నెల రోజుల పాటు ఇక్కడ ప్రత్యేక క్యాంపు ఏర్పాటు చేశారు. 25 మంది అండర్-19 క్రికెటర్లలో అర్జున్ ఒకడు. ఉదయం 6 గంటలకు ప్రాక్టీస్ సెషన్ ఆరంభమవుతుందని రాత్రితో వాళ్ల సాధన ముగుస్తుందని అధికారులు తెలిపారు.

అర్జున్ టెండూల్కర్ ఇక్కడ క్రికెట్ ప్రాక్టీస్ చేస్తున్నాడు. 25 మంది అండర్-19 క్రికెటర్లతో కలిసి స్టేడియం కాంప్లెక్స్‌లోనే నివాసం ఉంటున్నాడని హిమాచల్ ప్ర‌దేశ్‌ క్రికెట్ అసోసియేషన్(హెచ్‌పీసీఏ) అధికార ప్రతినిధి సంజయ్ శర్మ వెల్లడించారు. మే 20తో నెల రోజు క్యాంపు ముగుస్తుందని ఆయన చెప్పారు.

4639
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS