HomeLATEST NEWSArjun Tendulkar selected in Mumbai U-19 squad

ముంబై అండ‌ర్‌-19 టీమ్‌లో అర్జున్ టెండూల్క‌ర్‌

Published: Mon,September 11, 2017 08:02 PM
  Increase Font Size Reset Font Size decrease Font size   
ముంబై : మాస్ట‌ర్ బ్లాస్ట‌ర్ స‌చిన్ టెండూల్క‌ర్ కుమారుడు అర్జున్ టెండూల్క‌ర్ ముంబై అండ‌ర్-19 టీమ్‌కు సెల‌క్ట్ అయ్యాడు. బ‌రోడాలో జ‌రిగే జేవై లీలీ ఇన్విటేష‌న‌ల్ టోర్నీకి అత‌ను ఎంపిక‌య్యాడు. అర్జున్ గ‌తంలో ముంబై అండ‌ర్ -16 త‌ర‌పున కూడా ఆడాడు. ఈ నెల 24న‌ అర్జున్‌కు 18 ఏళ్లు పూర్త‌వుతాయి. జేవై టోర్న‌మెంట్ బీసీసీఐ టోర్నీ కాక‌పోయినా, ముంబై టీమ్ మాత్రం ఆ టోర్నీలో ఆడుతుంది. ఈ టోర్నీకి అర్జున్ ఎంపిక కావ‌డం అంటే, ఇక అత‌ను అండ‌ర్‌-19 క్రికెట్‌కు మ‌రింత ద‌గ్గ‌ర అయిన‌ట్లు తెలుస్తున్న‌ది. ఇటీవ‌ల ఇంగ్లండ్‌, సౌతాఫ్రికా టెస్టు మ్యాచ్ స‌మ‌యంలో అర్జున్ నెట్స్‌లో బౌలింగ్ చేశాడు. లెఫ్ట్ ఆర్మ్ బౌల‌ర్ అయిన అర్జున్ అప్పుడ‌ప్పుడు టీమిండియా నెట్స్‌లోనూ బౌలింగ్ చేస్తున్నాడు.
1423
Tags

More News

NATIONAL-INTERNATIONAL

SPORTS

Health

Technology