టీ20 లీగ్ నుంచి తప్పుకున్న అర్జున్ టెండూల్కర్

Thu,March 1, 2018 12:10 PM

Arjun Tendulkar opts out of Mumbai T20 League


ముంబయి: బ్యాటింగ్ లెజెండ్ సచిన్ టెండూల్కర్ తనయుడు, యువ క్రికెటర్ అర్జున్ టెండూల్కర్ త్వరలో ఆరంభంకానున్న ముంబయి టీ20లీగ్ నుంచి తప్పుకున్నాడు. ఎడమచేతి వాటం పేసర్ అయిన అర్జున్ తన బౌలింగ్ శైలిని మార్చుకునే పనిలో ఉన్నాడు. ఈ నేపథ్యంలో టోర్నమెంట్‌కు సిద్ధంగా లేకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నాడు. తన తండ్రి సచిన్‌తో సుధీర్ఘంగా చర్చించిన తరువాతనే లీగ్‌పై 18ఏళ్ల అర్జున్ తుది నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. జనవరి 8 నుంచి అర్జున్ తన బౌలింగ్ శైలిపై ప్రత్యేక కసరత్తు చేస్తున్నాడు. విశేషమేంటంటే ముంబయి టీ20 లీగ్‌కు మాస్టర్ బ్లాస్టర్ సచిన్ బ్రాండ్ అంబాసిడర్‌కు వ్యవహరిస్తున్నారు. ఈ లీగ్ మార్చి 11 నుంచి 21 వరకు జరగనుంది.

లీగ్‌లో తొలుత అర్జున్ ఆడుతాడని తెలియడంతో అందరి దృష్టి యువ క్రికెటర్‌పైనే పడింది. అతని నిష్క్రమణతో నిర్వాహకులు నిరుత్సాహంగా ఉన్నారు. తన తండ్రి ద్వారా క్రేజ్ తెచ్చుకున్న అర్జున్ ఉంటే లీగ్‌కు ప్రత్యేక ఆదరణ ఉంటుందని ఆర్గనైజర్లు భావించారు. ముంబయికి చెందిన టాప్ క్రికెటర్లు శ్రీలంకలో పర్యటించే టీమిండియా జట్టులో ఉండటం..మరికొంత మంది నాగ్‌పూర్‌లో జరిగే ఇరానీ కప్‌లో పాల్గొంటుండంతో చాలా వరకు సీనియర్ ఆటగాళ్లు లీగ్‌కు దూరమవుతున్నారు.

3295
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS