వన్డే టోర్నీ: సచిన్ కొడుకుకు పిలుపు

Wed,September 12, 2018 12:03 PM

Arjun Tendulkar Named in Mumbai U-19 Team For Invitational ODI Tournament

ముంబయి: మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ తనయుడు, ఆల్‌రౌండర్ అర్జున్ టెండూల్కర్‌ను ముంబయి అండర్-19 క్రికెట్ జట్టులోకి తీసుకున్నారు. 6వ ఆల్ ఇండియా అండర్-19 ఇవ్విటేషనల్ వన్డే టోర్నమెంట్‌లో ముంబయి తరఫున ప్రాతినిధ్యం వహించనున్నాడు. ముంబయి టీమ్‌కు సువెద్ పార్కర్‌కు కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించినట్లు ముంబయి క్రికెట్ అసోసియేషన్ జాయింట్ సెక్రటరీ ఉన్‌మేష్ ఖాన్విల్కర్ ఒక ప్రకటనలో తెలిపారు.

సెప్టెంబర్ 16న ఆరంభంకానున్న టోర్నమెంట్ వడోదరలో జరగనుంది. 18ఏళ్ల అర్జున్ గత జులైలో శ్రీలంక పర్యటనలో యూత్ టెస్టులో భాగంగా భారత్ అండర్-19 జట్టు తరఫున తొలి మ్యాచ్ ఆడాడు. ఈ సిరీస్‌లో అర్జున్ చెప్పుకోదగ్గస్థాయిలోనే రాణించాడు. అనంతరం ఇంగ్లాండ్‌తో టెస్టు సిరీస్‌లో పాల్గొన్న భారత బ్యాట్స్‌మెన్‌కు ప్రాక్టీస్ సెషన్‌లో బౌలింగ్ కూడా చేశాడు. గత సిరీస్‌లో కన్నా మెరుగైన ప్రదర్శన చేయాలని అర్జున్ పట్టుదలగా ఉన్నాడు.

9827
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles