హ్యాట్సాఫ్ అర్జున్ టెండూల్కర్!

Sat,August 11, 2018 08:05 AM

Arjun Tendulkar Lends Helping Hand to Ground Staff at Lords

లండన్: లెజెండరీ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ తనయుడు అర్జున్ టెండూల్కర్ ప్రస్తుతం లండన్‌లోని లార్డ్స్ మైదానంలో ఎంసీసీ యువ ఆటగాళ్లతో పాటు శిక్షణ తీసుకుంటున్నాడు. ప్రస్తుతం ఇదే మైదానంలో భారత్, ఇంగ్లాండ్ మధ్య రెండో టెస్టు మ్యాచ్ జరుగుతోంది. మ్యాచ్ ఆరంభానికి ముందు భారత బ్యాట్స్‌మెన్‌నకు అర్జున్ బౌలింగ్ చేసిన విషయం తెలిసిందే. కేవలం తన ఆటను మెరుగుపరచుకోవడమే కాదు మైదానం సిబ్బందికి కూడా అతడు సాయపడుతున్నాడు. ఎడతెరిపిలేకుండా కురిసిన వర్షం కారణంగా రెండో టెస్టు తొలిరోజు, గురువారం ఆట పూర్తిగా రైద్దెన విషయం తెలిసిందే.

మైదానాన్ని సిద్ధం చేసేందుకు అర్జున్ కూడా తనవంతుగా వారికి సాయపడ్డాడనని లార్డ్స్ క్రికెట్ నిర్వాహకులు సోషల్‌మీడియా ద్వారా తెలిపారు. హ్యాట్సాఫ్ అర్జున్ టెండూల్కర్! కేవలం ఎంసీసీ ఆటగాళ్లతో ప్రాక్టీస్ చేయడం మాత్రమే కాదు మా గ్రౌండ్ స్టాఫ్‌తో కలిసి సేవలందించాడని లార్డ్స్ మేనేజ్‌మెంట్ కొనియాడింది. ఈ విషయాన్ని తన అధికారిక ట్విటర్‌లో పోస్ట్ చేసింది. రెండో రోజు శుక్రవారం కూడా మ్యాచ్ మధ్యలో చాలాసార్లు వరుణుడు అంతరాయం కలిగించాడు. పిచ్‌ను కవర్లతో కప్పేందుకు గ్రౌండ్ సిబ్బంది చాలా ఇబ్బందిపడ్డారు.


4846
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles