అందరిలాగే సచిన్ తనయుడు: బౌలింగ్ కోచ్

Tue,June 19, 2018 04:06 PM

Arjun Tendulkar just like any other member of team Coach Sanath Kumar


ముంబయి: భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ కుమారుడు అర్జున్ టెండూల్కర్ టీమిండియా అండర్-19 జట్టుకు ఎంపికైన విషయం తెలిసిందే. వచ్చే నెలలో శ్రీలంక పర్యటనకు వెళ్తున్న భారత జట్టులో అర్జున్‌కు చోటు దక్కింది. ఐతే దిగ్గజ క్రికెటర్ తనయుడు కావడం వల్లే అతన్ని ఎంపికాచేశారని కొంతమంది బహిరంగంగానే విమర్శలు చేశారు. తాజా ఆ జట్టుకు కొత్తగా బౌలింగ్ కోచ్‌గా నియమితులైన సనత్‌కుమార్ స్పందించారు.


అందరిలాగే అతను కూడా జట్టులో ఒక ఆటగాడు మాత్రమేనని సనత్ చెప్పారు. అర్జున్ ఎంపికవడంతో అతనిపై అందరూ ప్రత్యేక దృష్టిసారించారని అతనితో ఎలా వ్యవహరిస్తారాని అడిగిన ప్రశ్నకు సమాధానంగా.. దాని గురించి నాకు అంతగా తెలియదు. ఒక కోచ్‌గా నాకు సంబంధంలేని విషయం. నాకు అందరు కుర్రాళ్లు సమానమే. నా దృష్టిలో మిగతా వాళ్లతో పోలిస్తే అర్జున్ భిన్నమైన ఆటగాడని అనుకోవట్లేదు. జట్టులో ప్రతి ఒక్కరూ తమ అత్యుత్తమ ఆటను ప్రదర్శించేలా వారిని తయారు చేయడమే నా బాధ్యత అని సనత్ వివరణ ఇచ్చారు.

2342
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles