కోహ్లీకి ప్రపోజ్ చేసిన యువతితో అర్జున్ టెండూల్కర్ లంచ్

Tue,August 7, 2018 05:11 PM

Arjun Tendulkar has lunch with England cricketer who proposed to Virat Kohli

లండన్: మాస్టర్ బ్లాస్టర్ స‌చిన్ టెండూల్క‌ర్‌ తనయుడు అర్జున్ టెండూల్కర్ ప్రస్తుతం ఇంగ్లాండ్‌లో ఎంజాయ్ చేస్తున్నాడు. యూత్ వన్డే సిరీస్‌లో అతనికి చోటు దక్కకపోవడంతో అతడు విశ్రాంతి తీసుకుంటున్నాడు. విరామం దొరకడంతో లండన్ వెళ్లి తన స్నేహితులతో సరదగా గడుపుతున్నాడు. ఈ నేపథ్యంలోనే ఇంగ్లీష్ క్రికెటర్ డేనియల్ వ్యాట్‌ను అర్జున్ కలిశాడు.

తాజాగా ఆమెతో కలిసి జూనియర్ టెండూల్కర్ లంచ్‌కు వెళ్లాడు. ఈ సందర్భంగా వ్యాట్‌తో సెల్ఫీ దిగాడు. ఈ ఫొటోను ఆమె తన ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌లో పోస్ట్ చేసింది. వ్యాట్ గురించి భారత క్రికెట్ అభిమానులకు పెద్దగా చెప్పాల్సిన అవసరం లేదు. 2014లో భారత క్రికెటర్ విరాట్ కోహ్లీ తనను పెళ్లి చేసుకోవాలని ట్వీట్ చేసిన విషయం తెలిసిందే. తాజాగా కోహ్లీకి ప్రపోజ్ చేసిన యువతితో అర్జున్ లంచ్‌కు వెళ్లడంతో నెటిజన్లు తమదైన శైలిలో స్పందిస్తున్నారు.


4649
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles