కోహ్లికి బౌలింగ్ చేసిన అర్జున్ టెండూల్కర్.. వీడియో

Wed,August 8, 2018 04:51 PM

Arjun Tendulkar bowled at Virat Kohli in nets

లండన్: లెజండరీ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ తనయుడు, టీమిండియా అండర్ 19 టీమ్ సభ్యుడు అయిన అర్జున్ టెండూల్కర్ మరోసారి ఇండియన్ బ్యాట్స్‌మెన్‌కు నెట్స్‌లో బౌలింగ్ చేశాడు. లార్డ్స్‌లో ఇంగ్లండ్‌తో జరగనున్న రెండో టెస్ట్‌కు ముందు ఇండియన్ టీమ్ నెట్స్‌లో ప్రాక్టీస్ చేసింది. ఈ సందర్భంగా కెప్టెన్ విరాట్ కోహ్లికి కూడా అర్జున్ బౌలింగ్ చేయడం విశేషం. చాలా వరకు లండన్‌లోనే గడిపే అర్జున్ టెండూల్కర్.. గతంలోనూ ఇండియన్ టీమ్‌కు బౌలింగ్ చేసిన సందర్భాలు ఉన్నాయి. ఎడ్‌బాస్టన్ టెస్ట్‌లో ఇంగ్లండ్ లెఫ్టామ్ పేస్‌బౌలర్ శామ్ కురన్ ఇండియన్ బ్యాట్స్‌మెన్‌ను తీవ్రంగా ఇబ్బంది పెట్టాడు. దీంతో నెట్స్‌లో లెఫ్టామ్ బౌలరే అయిన అర్జున్‌తో బౌలింగ్ చేయించడం విశేషం. ప్రస్తుతం టీమిండియాలో లెఫ్టామ్ పేస్‌బౌలర్ ఎవరూ లేరు. అందుకే అర్జున్ బౌలింగ్‌లో ప్రాక్టీస్ మన బ్యాట్స్‌మెన్‌కు ఎంతగానో ఉపయోగపడనుంది. తొలి టెస్ట్‌లో 31 పరుగులతో ఓడిన టీమిండియాకు లార్డ్స్ టెస్ట్ కీలకంగా మారింది. ముఖ్యంగా టీమ్ ఎంపికపై విమర్శలు వచ్చిన నేపథ్యంలో తుది జట్టు ఎలా ఉండబోతుందన్నదని ఆసక్తికరంగా మారింది.

4114
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS