నెట్స్‌లో ధోనీ, కోహ్లిలకు అర్జున్ టెండూల్కర్ బౌలింగ్.. వీడియో

Wed,June 27, 2018 05:18 PM

Arjun Tendulkar bowled at Virat Kohli and Dhoni in nets

డబ్లిన్: లెజెండరీ బ్యాట్స్‌మన్ సచిన్ టెండూల్కర్ కొడుకు అర్జున్ టెండూల్కర్ టీమిండియా సీనియర్ బ్యాట్స్‌మెన్ ధోనీ, కోహ్లిలకు నెట్స్‌లో బౌలింగ్ చేశాడు. ఈ మధ్యే శ్రీలంక టూర్‌కు వెళ్లే అండర్ 19 టీమ్‌కు సెలక్ట్ అయిన అర్జున్.. సీనియర్ టీమ్‌కు బౌలింగ్ చేసే చాన్స్ దక్కించుకోవడం విశేషం. ఈ సందర్భంగా కోచ్ రవిశాస్త్రి అతనికి కొన్ని టిప్స్ ఇచ్చాడు. లార్డ్స్ గ్రౌండ్‌లో అర్జున్ రెగ్యులర్‌గా నెట్స్‌లో బౌలింగ్ చేస్తుంటాడు. గతేడాది వరల్డ్‌కప్ సందర్భంగా వుమెన్స్ టీమ్‌కు కూడా అర్జున్ బౌలింగ్ చేశాడు. ఆ మధ్య అతను విసిరిన ఓ యార్కర్ కాలికి తగిలి ఇంగ్లిష్ బ్యాట్స్‌మన్ జానీ బెయిర్‌స్టో నెట్స్ వదిలి వెళ్లిన వార్త వైరల్‌గా మారిన విషయం తెలిసిందే. నెట్స్‌లో టీమిండియాకు అర్జున్ బౌలింగ్ చేసిన వీడియో ఇదే.


4622
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles