బర్త్‌డే గిఫ్ట్.. మెస్సీ చాకోలెట్ శిల్పం అదుర్స్

Sun,June 24, 2018 07:11 PM

Argentine gets life-size chocolate cake sculpture for 31st birthday

మాస్కో: అర్జెంటీనా సాకర్ స్టార్ లియోనెల్ మెస్సీ ఆదివారం తన 31వ పుట్టిన రోజును ఘనంగా జరుపుకున్నాడు. ప్రస్తుతం రష్యా వేదికగా జరుగుతున్న ఫిఫా ప్రపంచకప్‌లో అర్జెంటీనా జట్టు పాల్గొన్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న మెస్సీ అభిమానులు అతని జన్మదినాన్ని వేడుకగా నిర్వహించారు. మాస్కోలో ఓ బేకరీ నిర్వాహకులు మాత్రం ఏకంగా మెస్సీ రూపంలో ఉండే ఓ చాకోలెట్ కేక్ శిల్పాన్ని తయారు చేశారు. 60 కిలోల బరువుండే విగ్రహాన్ని ఐదుగురు సభ్యులతో కూడిన బృందం సుమారు 7 రోజుల పాటు శ్రమించి తీర్చిద్దినట్లు బేకరీ నిర్వాహకులు తెలిపారు.

అర్జెంటీనా జెర్సీ వేసుకొని తనదైన శైలిలో మెస్సీ పోజిస్తే ఎలా ఉంటుంతో కేక్ విగ్రహాం కూడా అలానే ఉంది. దీనికి సంబంధించిన ఫొటోలు ప్రస్తుతం వైరల్‌గా మారాయి. గ్రూప్-డీలో ఉన్న అర్జెంటీనా ఆడిన రెండింటిలో ఒక మ్యాచ్‌ను డ్రాగా ముగించగా.. మరొక మ్యాచ్‌లో ఘోర ఓటమిని ఎదుర్కొంది. దీంతో పాయింట్ల పట్టికలో ఒక్క పాయింట్‌తో ఆఖరి స్థానంలో ఉంది.

1558
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles