మెస్సీకి ఓ అరుదైన బర్త్ డే గిఫ్ట్!

Fri,June 22, 2018 03:07 PM

Argentina star Lionel Messi to get FIFA World Cup Trophy replica as Birth Day Gift

మాస్కో: రష్యాలో జరుగుతున్న ఫుట్‌బాల్ వరల్డ్‌కప్‌లో అర్జెంటీనా పరిస్థితి మరీ దారుణంగా ఉంది. గ్రూప్ స్టేజ్‌లోనే ఇంటిదారి పట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఐస్‌లాండ్‌తో జరిగిన తొలి మ్యాచ్‌ను 1-1తో డ్రా చేసుకున్న అర్జెంటీనా.. క్రొయేషియా చేతిలో ఏకంగా 0-3 గోల్స్ తేడాతో ఘోరంగా ఓడిపోయింది. దీంతో మెస్సీతోపాటు ఆ టీమ్ అభిమానులు తీవ్ర నిరాశలో ఉన్నారు. తన కెరీర్‌లో చివరి వరల్డ్ కప్ ఆడుతున్న 31 ఏళ్ల మెస్సీ తీవ్ర ఒత్తిడిలో ఉన్నారు. అయితే ఇంత గడ్డు పరిస్థితుల్లోనూ మెస్సీని చీర్ చేయడానికి రష్యాలోని బ్రోనిట్సీ అభిమానులు ఓ ప్లాన్ వేశారు.

మెస్సీ బర్త్ డే నాడు అతనికి ఫిఫా వరల్డ్‌కప్ ట్రోఫీ నమూనాతోపాటు ఓ స్పెషల్ కేక్‌ను ఇవ్వనున్నారు. అర్జెంటీనా కెప్టెన్ బర్త్‌డేను ఎలా మరచిపోతాం అని మాస్కో రీజియన్ స్పోర్ట్స్ మినిస్టర్ రోమన్ తెర్యుష్కోవ్ అన్నారు. ఈ నెల 24న మెసీ తన 31వ పుట్టిన రోజు జరుపుకుంటున్నాడు. ఫిఫా వరల్డ్‌కప్ ట్రోఫీ నమూనాను సాంప్రదాయ రష్యన్ ఘెల్ సెరామిక్స్‌తో తయారుచేశారు. ఈ నెల 26న నైజీరియాతో అర్జెంటీనా తమ చివరి లీగ్ మ్యాచ్‌ను ఆడనుంది.

1525
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles