దటీజ్ కుంబ్లే.. అచ్చూ జంబో చెప్పినట్లే గెలిచారు!

Mon,January 7, 2019 06:29 PM

Anil Kumbles Precise prediction about India Australia series winning internet heart

సిడ్నీ: ఇండియా, ఆస్ట్రేలియా సిరీస్ మొదలయ్యే ముందు ఎంతో మంది మాజీ క్రికెటర్లు ఫలితాన్ని అంచనా వేశారు. మెక్‌గ్రాత్, పాంటింగ్‌లాంటి ఆస్ట్రేలియా మాజీలైతే ఆసీస్‌దే గెలుపనీ తేల్చేశారు. ఆసీస్ 4-0తో గెలుస్తుందనీ అన్నారు. కానీ ఎవరెన్ని చెప్పినా.. చివరికి టీమిండియా మాజీ కెప్టెన్ అనిల్ కుంబ్లే అంచనాయే నిజమైంది. సిరీస్ ప్రారంభానికి ముందే జంబో ఫలితాన్ని కచ్చితంగా అంచనా వేశాడు. వర్షం వల్ల ఓ మ్యాచ్ డ్రా అవుతుందన్న విషయాన్ని కూడా అతడు ముందే చెప్పాడంటే కుంబ్లే క్రికెటింగ్ బ్రెయిన్ ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. క్రికెట్ నెక్ట్స్ వెబ్‌సైట్‌కు సిరీస్ మొదలయ్యే ముందు కుంబ్లే ఇంటర్వ్యూ ఇచ్చాడు. ఇందులో ఇండియా కచ్చితంగా 2-1తో గెలుస్తుందని చెప్పాడు. ఎందుకు ఓ మ్యాచ్ డ్రా అవుతుందని అనుకుంటున్నారా అని ప్రశ్నిస్తే.. వర్షాలు భారీగా పడే అవకాశం ఉంది కాబట్టి.. ఓ మ్యాచ్ డ్రా కావచ్చు అని కూడా కుంబ్లే అప్పుడే చెప్పాడు. ఇప్పుడతను చెప్పినట్లు కచ్చితంగా ఇండియా 2-1తో గెలిచింది. సిడ్నీ టెస్ట్ వర్షం కారణంగా డ్రా అయింది. దీంతో ఫ్యాన్స్ కుంబ్లేను ఆకాశానికెత్తుతున్నారు. జంబో ఓ ఆక్టోపస్ అంటూ ట్వీట్లు చేస్తున్నారు.
3898
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

country oven

Featured Articles

Health Articles