కుంబ్లే బ్యాటింగ్.. కోహ్లి ఫీల్డింగ్‌!

Thu,June 22, 2017 03:09 PM

Anil Kumble wanted to Bat first in the Champions Trophy Final

న్యూఢిల్లీ: కుంబ్లే, కోహ్లి విభేదాల‌కు సంబంధించి రోజుకో ఆస‌క్తిక‌ర‌మైన విష‌యం బ‌య‌ట‌ప‌డుతున్న‌ది. చాంపియ‌న్స్ ట్రోఫీ ఫైన‌ల్లో టాస్ గెలిచిన త‌ర్వాత బ్యాటింగ్ తీసుకోవాల‌ని కుంబ్లే సూచించాడ‌ట‌. అయితే కోహ్లి మాత్రం తాను ముందే డిసైడైన‌ట్లు ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. నిజానికి ముందు బ్యాటింగ్ చేసి భారీ స్కోరు చేస్తే.. పాకిస్థాన్‌పై ఒత్తిడి పెరుగుతుంద‌ని కుంబ్లే భావించాడ‌ని టీమ్ వ‌ర్గాలు వెల్ల‌డించాయి. కానీ విరాట్ ఫీల్డింగ్ తీసుకోవ‌డం.. అది కాస్తా ఎదురుత‌న్ని టీమ్ ఘోరంగా ఓడిపోయింది. ఇప్పటికే కుంబ్లే రాజీనామాతో డిఫెన్స్‌లో ప‌డిపోయిన విరాట్.. తాజాగా ఈ సీక్రెట్ బ‌య‌టికి రావ‌డంతో అత‌నిపై మ‌రింత ఒత్తిడి పెరిగింది. ఈ విభేదాల విష‌యంలో కుంబ్లే తాను చెప్పాల్సింది చెప్పినా.. విరాట్ మాత్రం ఇంకా నోరు విప్ప‌లేదు.

మ‌రోవైపు కుంబ్లేను ఇరుకున‌పెట్టేలా టీమ్ నుంచి కొన్ని వార్త‌లు వ‌స్తున్నాయి. అనిల్ త‌మ‌ను స్కూల్ పిల్ల‌ల్లా ట్రీట్ చేశాడ‌ని, ఫైన‌ల్లో ఓడిన త‌ర్వాత ప్లేయ‌ర్సంద‌రినీ నోటికొచ్చిన‌ట్లు తిట్టాడ‌ని టీమ్ వ‌ర్గాలు తెలిపాయి. ఈ ఘ‌ట‌న‌తో విరాట్, కుంబ్లే మ‌ధ్య విభేదాలు మ‌రింత ముదిరాయ‌ని తెలిసింది. త‌న‌కు, త‌న టీమ్ మెంబ‌ర్స్‌కు స్వేచ్ఛ కోరుకునే కోహ్లి.. కుంబ్లే తీరుతో విసిగిపోయాడ‌ట‌. ఇక డ్రెస్సింగ్ రూమ్ ఎవ‌రి ఆధీనంలో ఉండాల‌న్న విష‌యంలోనూ ఇద్ద‌రి మ‌ధ్యా గొడ‌వ‌ల‌ను మ‌రింత పెంచాయి. కుంబ్లే తాను చెప్పిన‌ట్లుగా వినాల‌ని హుకుం జారీ చేస్తే.. కోహ్లి మాత్రం వాటిని ప‌ట్టించుకోలేదు. ఆరు నెల‌లుగా ఇద్ద‌రి మ‌ధ్యా మాటల్లేవ‌ని బీసీసీఐ అధికారే చెప్ప‌డం చూస్తే వీళ్ల మ‌ధ్య విభేదాలు ఏ స్థాయిలో ఉన్నాయో అర్థం చేసుకోవ‌చ్చు.

3803
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles