ఐసీసీ క్రికెట్‌ కమిటీ ఛైర్మన్‌గా మళ్లీ కుంబ్లేనే..

Sun,March 3, 2019 11:06 AM

Anil Kumble reappointed as ICC Cricket Committee chairman for 3 years

దుబాయ్‌: అంతర్జాతీయ క్రికెట్‌ మండలి(ఐసీసీ) క్రికెట్‌ కమిటీ ఛైర్మన్‌గా టీమిండియా మాజీ కెప్టెన్‌ అనిల్‌ కుంబ్లే మరోసారి నియమితులయ్యారు. 2012లో తొలిసారి కమిటీ ఛైర్మన్‌గా ఎంపికైన కుంబ్లే మరో మూడేళ్ల పాటు ఈ పదవిలో కొనసాగనున్నారు. స్పిన్‌ మాంత్రికుడు అనిల్‌ తొలిసారి 2012లో వెస్టిండీస్‌ మాజీ క్రికెటర్‌ ైక్లెవ్‌ లాయిడ్‌ నుంచి ఛైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించారు. దుబాయ్‌లో ఆరు రోజుల పాటు జరిగిన ఐసీసీ సమావేశాల్లో కుంబ్లే ఎంపికపై నిర్ణయం తీసుకున్నట్లు ఐసీసీ ఒక ప్రకటనలో పేర్కొంది. అంతర్జాతీయ క్రికెట్లో 18ఏళ్ల పాటు కొనసాగిన లెగ్‌స్పిన్నర్‌ కుంబ్లే 132 టెస్టుల్లో 619 వికెట్లు తీశాడు. అలాగే 271 వన్డేల్లో 337 వికెట్లు పడగొట్టాడు. అత్యధిక వికెట్లు తీసిన ఆటగాళ్ల జాబితాలోనూ చోటు దక్కించుకున్నాడు. క్రికెట్‌ చరిత్రలో ఒక ఇన్నింగ్స్‌లో పది వికెట్లు తీసిన రెండో ఆటగాడు కుంబ్లేనే కావడం విశేషం.

2290
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles