కుంబ్లేనే అవమానిస్తారా.. బీసీసీఐపై ఫ్యాన్స్ సీరియస్!

Tue,October 17, 2017 03:48 PM

Anil Kumble fans slam BCCI for showing disrespect to the legendary cricketer

ముంబై: కామ్‌గా ఉంటూ ఎలాంటి వివాదాల జోలికి వెళ్లకుండా తమ పని తాము చేసుకొని వెళ్లే వాళ్లంటే అందరికీ లోకువేనేమో. అది అనిల్ కుంబ్లేలాంటి లెజెండరీ క్రికెటర్ అయినా అవమానాలు తప్పవు. గతంలో విరాట్ కోహ్లితో విభేదాల వల్ల తన కోచ్ పదవిని అవమానకర రీతిలో కోల్పోయిన కుంబ్లేకు ఇప్పుడు కూడా సరైన గౌరవం ఇవ్వడం లేదు బీసీసీఐ. జంబో ఇవాళ తన 47వ పుట్టిన రోజు జరుపుకుంటున్నాడు. ఈ సందర్భంగా బీసీసీఐ మొదట ఓ ట్వీట్ చేసింది. అందులో సింపుల్‌గా ఇండియన్ టీమ్ మాజీ బౌలర్‌కు పుట్టిన రోజు శుభాకాంక్షలు అంటూ ట్వీట్ చేసింది.


ఇది చూసిన అభిమానులకు ఒళ్లు మండింది. దీంతో బోర్డును ట్వీట్లతో ఆటాడుకున్నారు. ఇండియన్ టీమ్ గొప్ప బౌలర్లలో ఒకడైన అతన్ని కేవలం ఓ మాజీ బౌలర్ అంటూ బోర్డు చెప్పడం అభిమానుల ఆగ్రహానికి కారణమైంది. అతను ఇండియా తరఫున అత్యధిక వికెట్లు తీసుకున్న బౌలర్ కాదా? మాజీ కెప్టెన్.. అంతేకాదు కోచ్‌గా కూడా చేశాడు కదా అంటూ బోర్డును నిలదీశారు. కుంబ్లేలాంటి లెజెండ్‌కు ఇవ్వాల్సిన గౌరవం ఇవ్వండి అంటూ ట్విట్టర్‌లో కోరారు. దీంతో బీసీసీఐ చేసిన తప్పును తెలుసుకొని మరో ట్వీట్ చేసింది. మాజీ కెప్టెన్, లెజెండ్ అంటూ ఏదో తప్పు కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేసింది.

3816
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles