కోర్టులోనే చిన్న పిల్లాడిలా ఏడ్చేసిన ముర్రే..:వీడియో

Fri,August 3, 2018 03:59 PM

వాషింగ్టన్: బ్రిటన్ స్టార్ టెన్నిస్ ప్లేయర్, ప్రపంచ మాజీ నెంబర్ వన్ ఆండీ ముర్రే.. అంతర్జాతీయ టెన్నిస్‌లో పరిచయం అక్కర్లేని పేరు. గాయం కారణంగా దాదాపు ఏడాది పాటు టెన్నిస్‌కు దూరమైన ముర్రే ర్యాంకింగ్స్‌లో 832వ స్థానంలో కొనసాగుతున్నాడు. అమెరికాలో జరుగుతున్న సిటీ ఓపెన్ ఏటీపీ-500 టెన్నిస్ టోర్నీలో చాలా రోజుల తర్వాత అతడు ఆడుతున్నాడు. ప్రీక్వార్టర్స్‌లో 93వ ర్యాంకు మారియస్ కోపిల్(రొమేనియా)తో హోరాహోరీ పోరులో 6-7(5), 6-3, 7-6(4) తేడాతో గెలుపొంది బ్రిటన్‌స్టార్ క్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించాడు.

స్థానిక కాలమానం ప్రకారం శుక్రవారం రాత్రి ఏడు గంటలకు క్వార్టర్‌ఫైనల్లో 19ఏళ్ల అలెక్స్ డీ మినార్(ఆస్ట్రేలియా)తో ఆండీ తలపడనున్నాడు. ఐతే వర్షం కారణంగా అర్ధరాత్రి తర్వాత ఆలస్యంగా ప్రారంభమైన ప్రీక్వార్టర్స్‌ మ్యాచ్ తెల్లవారుజామున 03:02 గంటలకు ముగియడంతో తరువాతి పోరు నుంచి తప్పుకుంటున్నట్లు ముర్రే తెలిపాడు. సుధీర్ఘంగా సాగిన రసవత్తర పోరులో తీవ్రంగా శ్రమించిన ముర్రే ఆఖరికి పైచేయి సాధించాడు. మ్యాచ్ ముగిసిన తరువాత ముర్రే భావోద్వేగానికి గురయ్యాడు. మూడు సార్లు గ్రాండ్‌స్లామ్ విజేత ముర్రే గాయం నుంచి కోలుకున్న తరువాత ఆడుతున్న మూడో టోర్నమెంట్ ఇదే. అత్యుత్తమ ప్రదర్శన చేసి మ్యాచ్‌లో విజయం సాధించిన తరువాత రెండుసార్లు ఒలింపిక్ ఛాంపియన్ ముర్రే బెంచ్‌పై కూర్చొని టవల్‌ను అడ్డుపెట్టుకొని కన్నీటిపర్యంతమయ్యాడు. కోర్టులోనే చాలాసేపు ఒంటరిగా కూర్చొని చిన్నపిల్లాడిలా ఏడ్చేశాడు.


2053
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles