ఇక ఆడ‌లేనేమో.. క‌న్నీరు పెట్టిన టెన్నిస్ స్టార్

Fri,January 11, 2019 05:00 PM

Andy Murray says Australian Open could be his last tournament

మెల్‌బోర్న్: బ్రిట‌న్ టెన్నిస్ స్టార్, మాజీ నెంబ‌ర్ వ‌న్‌ ఆండీ ముర్రే.. మీడియా ముందు క‌న్నీరుపెట్టారు. త‌న కెరీర్ అర్ధాంత‌రంగా ముగుస్తోంద‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. ఆస్ట్రేలియ‌న్ ఓపెన్ కోసం మెల్‌బోర్న్ వ‌చ్చిన అత‌ను మీడియాతో మాట్లాడారు. హిప్ స‌ర్జ‌రీ త‌ర్వాత త‌న స‌త్తా త‌గ్గింద‌ని, ఆ నొప్పికి ఎక్కువ‌గా ఆడ‌లేక‌పోతున్న‌ట్లు అత‌ను తెలిపాడు. మూడు సార్లు గ్రాండ్‌స్లామ్ టోర్నీలు గెలిచిన అత‌ను మీడియా ముందు దుఖ్కాన్ని ఆపుకోలేక‌పోయారు. నొప్పితో మ‌రో నాలుగైదు నెల‌లు ఆడ‌డం కూడా క‌ష్ట‌మే అని అన్నారు. ఈ ఏడాది వింబుల్డ‌న్ ఆడాల‌ని ఉంది, కానీ ఆ టోర్నీ ఆడుతానో లేదో అని ఆందోళ‌న వ్య‌క్తం చేశాడు. త్వ‌ర‌లోనే టెన్నిస్‌కు గుడ్‌బై చెప్ప‌నున్న‌ట్లు అత‌ను వెల్ల‌డించాడు.

2450
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles