ఓడితే సెమీస్ ఆశలు గల్లంతే..

Mon,June 10, 2019 03:01 PM

Andre Russell out injured as WI bowl

సౌతాంప్టన్‌: టైటిల్ ఫేవరెట్లలో ఒకటిగా ప్రపంచకప్‌లో ఉత్సాహంగా అడుగుపెట్టిన సౌతాఫ్రికా వరుస ఓటములతో ఢీలాపడింది. సెమీస్ ఆశలు సజీవంగా ఉండాలంటే మిగిలిన ఆరు మ్యాచ్‌లు గెలవాల్సిన పరిస్థితి తెచ్చుకుంది. ఈ తరుణంలో సోమవారం రోస్ బౌల్ మైదానం వేదికగా వెస్టిండీస్‌తో తలపడనుంది. టాస్ గెలిచిన వెస్టిండీస్ బౌలింగ్ ఎంచుకుంది. డారెన్ బ్రావో, కెమ‌ర్ రోచ్‌ల‌ను జ‌ట్టులోకి తీసుకున్న‌ట్లు విండీస్ సార‌థి హోల్డ‌ర్ తెలిపాడు. గాయం కార‌ణంగా స్టార్ ఆల్‌రౌండ‌ర్ ఆండ్రీ ర‌స్సెల్ మ్యాచ్‌కు దూర‌మ‌య్యాడు. ప్ర‌పంచ‌క‌ప్‌లో బోణీ కొట్ట‌ని ద‌క్షిణాఫ్రికా కూడా మార్పులు చేసింది. తుది జ‌ట్టులోకి ఎయిడెన్ మార్‌క్ర‌మ్‌, హెండ్రిక్స్‌ను తీసుకున్న‌ట్లు స‌ఫారీ సార‌థి డుప్లెసిస్ పేర్కొన్నాడు. పేల‌వ ప్ర‌ద‌ర్శ‌న‌తో డుమిని, షంషీల‌ను ప‌క్క‌న పెట్టారు.

5722
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles