భార‌త్‌తో టెస్టు: ఆండర్సన్‌కు జరిమానా

Sun,September 9, 2018 02:54 PM

Anderson Fined for Showing Dissent at Umpire Decision

లండన్: ఇంగ్లాండ్ స్టార్ పేసర్ జేమ్స్ ఆండర్సన్‌కు జరిమానా విధించారు. ఐసీసీ క్రీడా నియమావళిని ఉల్లంఘించిన నేపథ్యంలో ఆండర్సన్‌కు మ్యాచ్ ఫీజులో 15శాతం కోత పడింది. క్రమశిక్షణా చర్యల కింద ఒక డీమెరిట్ పాయింట్‌ను కూడావేశారు. ఓవల్ మైదానంలో భారత్‌తో ఇంగ్లాండ్ జట్టు ఐదో టెస్టు మ్యాచ్‌లో తలపడుతోంది. రెండోరోజైన శనివారం ఆటలో అంపైర్ నిర్ణయంపై ఆండర్సన్ అసంతృప్తి వ్యక్తం చేయడంతో మ్యాచ్ రిఫరీ ఆండీ పైక్రాఫ్ట్ ఈ నిర్ణయం తీసుకున్నారు.

అసలేం జరిగిందంటే.. భారత ఇన్నింగ్స్‌లో ఆండర్సన్ వేసిన 29వ ఓవర్‌లో బంతి విరాట్ కోహ్లీ ప్యాడ్లను తాకింది. దీంతో ఆండర్సన్ వెంటనే అప్పీల్ చేయడంతో అంపైర్ కుమార ధర్మసేన నాటౌట్‌గా ప్రకటించాడు. అనంతరం రివ్యూ కోరగా.. అందులోనూ ఆండర్సన్‌కు నిరాశ తప్పలేదు. దీంతో ఆవేశానికి లోనై ధర్మసేనతో పాటు విరాట్ కోహ్లీతో ఆండర్సన్ వాగ్వివాదానికి దిగాడు.

4158
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles