డేవిడ్ వార్న‌ర్‌కు దోశ తినిపించిన యాంక‌ర్ సుమ.. ఫొటోలు వైర‌ల్‌..!

Wed,March 20, 2019 07:41 PM

anchor suma fed dosa to cricketer david warner

ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్ (ఐపీఎల్) 12వ సీజ‌న్‌ మ‌రో మూడు రోజుల్లో ప్రారంభ‌మ‌వుతున్న విష‌యం విదిత‌మే. ఈ క్ర‌మంలోనే ఆయా జ‌ట్ల‌కు చెందిన ఆటగాళ్లు ఇప్ప‌టికే టోర్న‌మెంట్ కోసం సిద్ధ‌మ‌వుతున్నారు. అందులో భాగంగానే ఆట‌గాళ్లంద‌రూ క‌ల‌సి రోజూ నెట్స్‌లో ఇప్ప‌టికే ప్రాక్టీస్ ప్రారంభించారు. కాగా ఇటు స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్ జ‌ట్టు ఆట‌గాళ్లు కూడా ఓ వైపు ప్రాక్టీస్ చేస్తూనే మ‌రో వైపు ఖాళీ దొరికిన‌ప్పుడ‌ల్లా యాడ్స్ షూటింగ్‌ల‌లో పాల్గొంటున్నారు. ఈ క్ర‌మంలోనే హైద‌రాబాద్ జట్టు ఆటగాళ్లు డేవిడ్ వార్న‌ర్‌, భువ‌నేశ్వ‌ర్ కుమార్‌లు తాజాగా ప్ర‌ముఖ యాంక‌ర్ సుమ‌తో క‌ల‌సి కొంత సేపు షూటింగ్‌లో సంద‌డి చేశారు.

షూటింగ్‌లో భాగంగా సుమ హైద‌రాబాద్ ఆట‌గాడు డేవిడ్ వార్న‌ర్‌కు దోశె తినిపించారు. ఈ క్ర‌మంలో ఆ ఫొటోల‌ను సుమ తన ఫేస్‌బుక్ ఖాతాలో షేర్ చేయ‌గా, ప్ర‌స్తుతం ఆ ఫొటోలు నెట్ లో వైర‌ల్ అవుతున్నాయి. కాగా గ‌త ఏడాది బాల్ ట్యాంప‌రింగ్‌కు పాల్ప‌డి ఏడాది పాటు నిషేధాన్ని ఎదుర్కొంటున్న డేవిడ్ వార్న‌ర్ ఈ సారి ఐపీఎల్‌లో ఆడుతున్నాడు. మ‌రో వారం రోజుల్లో వార్న‌ర్‌పై నిషేధం పూర్తి కానుంది. దీంతో అత‌ను స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్ జ‌ట్టు త‌ర‌ఫున మ‌ళ్లీ ఐపీఎల్‌లో ఆడ‌నున్నాడు. ఇక ఈ నెల 24వ తేదీన కోల్‌క‌తా నైట్ రైడ‌ర్స్ తో స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్ జ‌ట్టు త‌న మొద‌టి మ్యాచ్ ఆడ‌నుంది..!5195
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles