ఐసీసీకి బిగ్ బీ చుర‌క‌లు

Tue,July 16, 2019 12:19 PM

Amitabh Bachchan fire on ICC

లార్డ్స్ వేదికగా ఇంగ్లండ్, న్యూజిలాండ్ మధ్య ఆదివారం జరిగిన 12వ ప్రపంచకప్ ఫైనల్లో ఇరు జట్ల స్కోర్లు సమమయ్యాయి. ఫలితం తేల్చడం కోసం సూపర్ ఓవర్ నిర్వహిస్తే అది కూడా టైగానే ముగిసింది. అయినా ఇంగ్లండ్‌ను విజేతగా ప్రకటించారు. మ‌రి అందుకు కార‌ణం ఏమంటే మ్యాచ్‌లో ఇంగ్లండ్ ఎక్కువ బౌండ్రీలు కొట్టింది అని తేల్చారు.ఈ విచిత్ర నిబంధ‌న‌పై క్రీడా విశ్లేష‌కులు, అభిమానుల‌తో పాటు ప‌లువురు ప్ర‌ముఖులు మండిప‌డుతున్నారు. తాజాగా బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బ‌చ్చ‌న్ కాస్త విభిన్నంగా స్పందించారు. మీ ద‌గ్గ‌ర రెండు వేల రూపాయ‌లు ఉంటే, నా ద‌గ్గ‌ర 2000 రూపాయ‌లు ఉన్నాయి. మీ ద‌గ్గ‌ర రెండు వేల రూపాయ‌ల నోటు ఒక‌టి ఉంటే, నా ద‌గ్గ‌ర 500 రూపాయ‌ల నోట్లు నాలుగు ఉన్నాయి. మ‌రి ఎవ‌రు ధ‌న‌వంతులు అంటే ??? ఐదు వంద‌ల నోట్లు నాలుగు ఉన్నోడే గొప్పోడు అని ఐసీసీ అంటుంద‌ని మెగాస్టార్ కాస్త వ్యంగ్యంగా ట్వీట్ చేశారు. ఇక కొద్ది సేప‌టి క్రితం త‌న ఫ్రెండ్ పీయూష్ పాండే ఇండియ‌న్ ఎక్స్ ప్రెస్ పెట్టిన హెడ్ లైన్‌ని నాకు ట్వీట్ చేశాడు. ఇంగ్లండ్ విజ‌యం ఓవ‌ర్‌త్రోతో సాధ్య‌మైందని త‌న ట్వీట్‌లో తెలిపారంటూ బిగ్ బీ పేర్కొన్నాడు4118
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles