భార‌త్‌పై కింగ్ ఆఫ్ స్వింగ్.. జిమ్మీ సెన్సేష‌న‌ల్ బౌలింగ్:వీడియోలు

Sat,August 11, 2018 10:06 AM

All smiles as jimmy9 leads the team back into the changing room

లండన్: ప్రతిష్ఠాత్మక లార్డ్స్ మైదానంలో ఇంగ్లాండ్‌తో జరుగుతున్న రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో భారత బ్యాట్స్‌మెన్ పేలవప్రదర్శనతో నిరాశపరిచారు. జట్టులో మార్పులు చేసినప్పటికీ ప్రదర్శనలో ఎలాంటి మార్పులేదు. జేమ్స్ ఆండ‌ర్స‌న్‌ నుంచి మిస్సైల్‌లా దూసుకొచ్చిన బంతులకు 15 పరుగులకే టాప్ ఆర్డర్ వికెట్లను కోల్పోయింది. ఆ తరువాత రహానె, విరాట్ ఆత్మవిశ్వాసంతో ఇన్నింగ్స్ నిర్మించే ప్రయత్నం చేశారు. విరాట్‌ని క్రిస్‌వోక్స్ పెవిలియన్ పంపడంతో ఆ తరువాత క్రీజులోకి వచ్చిన భారత బ్యాట్స్‌మెన్ పెవిలియన్‌కు క్యూ కట్టారు.

ఇంగ్లాండ్ పేసర్లు లైన్ అండ్ లెంగ్త్‌తో బంతులేసి భారత్‌ను కుప్పకూల్చారు. ముఖ్యంగా కింగ్ ఆఫ్ స్వింగ్ జిమ్మీ(5/20) ధాటికి తొలి ఇన్నింగ్స్‌లో టీమ్‌ఇండియా 35.2 ఓవర్లకే 107 చుట్టేసింది. అశ్విన్(29) టాప్ స్కోరర్. కెప్టెన్ విరాట్ కోహ్లీ(23) చెప్పుకోదగ్గస్థాయిలో పోరాడాడు. ఆతిథ్య పేసర్లు ఇన్‌స్వింగర్లు, ఔట్‌స్వింగర్లతో చెలరేగారు. కోహ్లీసేనను స్వల్పస్కోరుకే ఆలౌట్ చేయడంలో విశేషంగా రాణించిన ఆండర్సన్‌కు సహచర ఆటగాళ్లు అభినందనలు తెలిపారు. డ్రెస్సింగ్ రూమ్‌లోకి రాగానే చప్పట్లతో ఘనస్వాగతం పలికారు. శుక్రవారం ఆటలో అతని బౌలింగ్ హైలెట్‌గా నిలిచింది. ప్రపంచవ్యాప్తంగా దిగ్గజ క్రికెటర్లు, అభిమానులు ఆండర్సన్‌కు అభినందనలు తెలిపారు.

ఆండర్సన్ రికార్డులు..!

1.భారత్‌పై అత్యధిక వికెట్లు(95) పడగొట్టిన తొలి పేసర్ జేమ్స్ ఆండర్సన్
2.సొంత గడ్డపై అత్యధిక వికెట్లు(345) తీసిన బౌలర్లలో ఆండర్సన్ రెండో స్థానంలో ఉన్నాడు. స్టార్ పేసర్ ఒక్క లార్డ్స్ మైదానంలోనే 99 వికెట్లు తీశాడు.
3. టెస్టు కెరీర్‌లో జిమ్మీకిది 26వ ఐదు వికెట్ల ప్రదర్శన కావడం విశేషం.
4. ప్రస్తుతం 140టెస్టుల్లో 260 ఇన్నింగ్స్‌ల్లో 549 వికెట్లు పడగొట్టాడు. ఇందులో మూడు 10వికెట్ల ప్రదర్శన కూడా ఉంది.2033
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles