ఆ ముగ్గురు క్రికెటర్లకు జరిమానా

Sat,September 22, 2018 04:16 PM

Ali Hasan, Asghar Afghan and Rashid Khan fined 15 percent of match fee

అబుదాబి: అఫ్గనిస్థాన్, పాకిస్థాన్ మధ్య జరిగిన మ్యాచ్‌లో నిబంధనలు ఉల్లంఘించిన ముగ్గురు ఆటగాళ్లకు జరిమానా పడింది. పాకిస్థాన్ పేసర్ అలీ హసన్‌తో పాటు అఫ్గనిస్థాన్ కెప్టెన్ అస్గర్ అఫ్గన్, స్పిన్నర్ రషీద్ ఖాన్‌లకు మ్యాచ్ ఫీజులో తలో 15శాతం కోత విధించారు. ఆసియా కప్ సూపర్-4 మ్యాచ్‌ల్లో భాగంగా శుక్రవారం జరిగిన మ్యాచ్‌లో వేర్వేరు సందర్భాల్లో క్రీడా నియమావళిని అతిక్రమించడంతో మ్యాచ్ రిఫరీ వారికి జరిమానా విధించారు. ముగ్గురికి తలో ఒక డీమెరిట్ పాయింట్ కూడా వేశారు.

అఫ్గనిస్థాన్ ఇన్నింగ్స్ 33వ ఓవర్‌లో హస్మతుల్లా షాహిదీతో హసన్ వ్యక్తిగత దూషణకు దిగాడు. 37వ ఓవర్లో హసన్ వికెట్ల మధ్య పరుగు తీస్తుండగా అఫ్గన్ ఉద్దేశపూర్వకంగా హసన్‌ను తన భుజంతో ఢీకొట్టాడు. మరోవైపు పాక్ బ్యాట్స్‌మన్ ఆసిఫ్ అలీని ఔట్ చేసిన తరువాత రషీద్.. తన చేతి వేళ్లతో అసభ్యకర రీతిలో బ్యాట్స్‌మన్‌కు వీడ్కోలు పలకడం చర్చనీయాంశమైంది. ఐసీసీ మ్యాచ్ రిఫరీ ఆండీ పైక్రాఫ్ట్ ఈ ఘటనలపై విచారణ జరపగా.. ముగ్గురు ఆటగాళ్లు తమ తప్పులను ఒప్పుకోవడంతో వారిపై నిబంధనలకు అనుగుణంగా చర్యలు తీసుకున్నారు.

4320
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles