ఫేర్‌వెల్‌ టెస్టులో కుక్ సెంచరీ

Mon,September 10, 2018 06:06 PM

Alastair Cook, Joe Root take Englands lead to 283 at lunch

లండన్: కెరీర్‌లో ఆఖరి టెస్టు ఆడుతున్న అలిస్టర్ కుక్(103 నాటౌట్) శతకంతో మెరిశాడు. భారత్‌తో జరుగుతున్న ఐదో టెస్టు మ్యాచ్‌లో స్ఫూర్తిదాయక ప్రదర్శనతో ఆకట్టుకుంటున్నాడు. ఓవర్‌నైట్ స్కోరు 46తో బ్యాటింగ్ ఆరంభించిన కుక్ భారత పేసర్లను ధాటిగా ఎదుర్కొంటూ భారీ స్కోరు దిశగా పయనిస్తున్నాడు. సెంచరీ పూర్తవగానే కుక్ భావోద్వేగానికి లోనయ్యాడు. గ్యాలరీలో ఉన్న తన కుటుంబసభ్యులు, డ్రెస్సింగ్ రూమ్‌లో ఉన్న సహచర ఆటగాళ్లు నిలబడి చప్పట్లతో అభినందనలు తెలిపారు. టెస్టుల్లో అతనికిది 33వ సెంచరీ కావడం విశేషం.

నాలుగో రోజు ఆటను ఆరంభించిన కుక్, కెప్టెన్ జో రూట్ నిలకడగా రాణిస్తున్నారు. జో రూట్(92 నాటౌట్) కూడా శతకానికి చేరువలో ఉన్నాడు. వీరిద్దరూ మరోవికెట్ పడకుండా జాగ్రత్తగా ఆడుతున్నారు. లంచ్ విరామ సమయానికి రెండో ఇన్నింగ్స్‌లో 2 వికెట్ల నష్టానికి ఇంగ్లాండ్ 243 పరుగులు చేసింది. ప్రస్తుతం ఇంగ్లాండ్ 283 పరుగుల ఆధిక్యంలో కొనసాగుతోంది.

2611
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles