రహానె శతకం..భారీ ఆధిక్యం దిశగా భారత్

Sun,August 25, 2019 10:16 PM

Ajinkya Rahane hits 1st international hundred in 2 years

ఆంటిగ్వా: వెస్టిండీస్‌తో తొలి టెస్టుల్లో టీమిండియా బ్యాట్స్‌మన్ ఆజింక్య రహానె(102: 242 బంతుల్లో 5ఫోర్లు) శతకంతో చెలరేగాడు. టెస్టు క్రికెట్లో రహానెకిది పదో సెంచరీ కావడం విశేషం. 81/3తో కష్టాల్లో ఉన్న జట్టును రహానె ఆదుకున్నాడు. తొలుత విరాట్ కోహ్లీతో కలిసి విలువైన భాగస్వామ్యం నెలకొల్పిన అతడు తర్వాత హనుమ విహారితో కలిసి భారీగా పరుగులు జోడించాడు. మరోఎండ్‌లో విహారీ కూడా సెంచరీకి చేరువలో ఉన్నాడు. రెండో ఇన్నింగ్స్‌లో 112 ఓవర్లు ఆడిన భారత్ 6 వికెట్లకు 342 పరుగులు చేసింది. తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం కలుపుకొని భారత్ 417 పరుగుల ఆధిక్యంలో ఉంది. విండీస్‌కు భారీ లక్ష్యాన్ని నిర్దేశించి మిగిలిన రోజున్నర ఆటలో ఆలౌట్ చేయాలని భారత్ భావిస్తోంది. విరాట్ ఔటైన తర్వాత క్రీజులోకి వచ్చిన విహారి(93) దూకుడుగా ఆడాడు. సునాయాసంగా ఫోర్లు బాదడంతో పాటు ఒక సిక్సర్ కూడా కొట్టాడు. వికెట్లు తీసేందుకు కరీబియన్ బౌలర్లు శ్రమిస్తున్నారు.

తొలి ఇన్నింగ్స్..
భారత్: 297
విండీస్: 222

1609
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles