మాంచెస్ట‌ర్ నో ఫ్లై జోన్‌..

Tue,July 9, 2019 02:03 PM

Airspace Over Old Trafford To Remain Shut During Match, English Board Tells BCCI

హైద‌రాబాద్‌: వ‌ర‌ల్డ్‌క‌ప్‌లోని మాంచెస్ట‌ర్‌లోని ఓల్డ్ ట్రాఫోర్డ్ మైదానంలో మ‌రికొన్ని గంట‌ల్లో తొలి సెమీఫైన‌ల్ జ‌ర‌గ‌నున్న‌ది. ఈ నేప‌థ్యంలో ఆ ప్రాంతాన్ని ఇవాళ నో ఫ్లై జోన్‌గా ప్ర‌క‌టించారు. ఇంగ్లండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు ఓ లేఖ‌లో ఈ విష‌యాన్ని బీసీసీఐకి చెప్పింది. ఓల్డ్ ట్రాఫోర్డ్ ఎయిర్‌స్పేస్‌ను ఇవాళ మూసివేస్తున్న‌ట్లు ఈసీబీ ఆ లేఖ‌లో తెలియ‌జేసింది. శ‌నివారం శ్రీలంక‌తో మ్యాచ్ సంద‌ర్భంగా బ్రాడ్‌ఫోర్ట్ జోన్‌లో ఓ ఎయిర్‌క్రాఫ్ట్ బ్యాన‌ర్ల‌తో ప‌దేప‌దే చ‌క్క‌ర్లు కొట్టింది. ఇండియా స్టాప్ మాబ్ లించింగ్‌, జ‌స్టిస్ ఫ‌ర్ క‌శ్మీర్ అన్న బ్యాన‌ర్ల‌తో ఆ విమానం మాంచెస్ట‌ర్ గ‌గ‌న‌త‌లంలో విహ‌రించింది. ఈ ఘ‌ట‌న ప‌ట్ల ఆందోళ‌న‌కు గురైన ఐసీసీ ఇవాళ ఆ స్టేడియంలో ప్రాంతంలో నో ఫ్లై జోన్ ఆదేశాలు జారీ చేసింది.మరికాసేప‌ట్లో ప్రారంభంకానున్న మ్యాచ్ కోసం ఇరు జ‌ట్ల క్రికెట‌ర్లు స్టేడియంకు వ‌స్తున్నారు.

4161
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles