సైక్లోన్ 'మహా' ముప్పు..రెండో టీ20 సందేహమే?

Tue,November 5, 2019 01:37 PM

న్యూఢిల్లీ: భారత్, బంగ్లాదేశ్ టీ20 సిరీస్‌కు వాతావరణ పరిస్థితులు అనుకూలించడం లేదు. ఢిల్లీలో జరిగిన తొలి టీ20 మ్యాచ్‌కు వాయు కాలుష్యం ఇబ్బందిపెట్టినప్పటికీ ఆటగాళ్ల ఆరోగ్యాన్ని పణంగా పెట్టి మ్యాచ్ నిర్వహించారు. గురువారం రాజ్‌కోట్ వేదికగా రెండో టీ20 జరగాల్సి ఉంది. గత కొద్ది రోజులుగా మహారాష్ట్ర, గుజరాత్ రాష్ర్టాల్లో 'సైక్లోన్ మహా' వల్ల భారీగా వర్షాలు కురుస్తున్నాయి. రెండో టీ20కి తుఫాన్ ముప్పు పొంచి ఉండటంతో అంతా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మ్యాచ్ రోజైన 7న సౌరాష్ట్రలో అతి భారీ వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది.


అరేబియా సముద్రంలో ఏర్పడిన అల్పపీడనం మంగళవారం దిశను మార్చుకొని గుజరాత్‌వైపు దూసుకొస్తుందని, వాతావరణ శాఖ ఇప్పటికే తుఫాన్ హెచ్చరికలు జారీ చేసింది. బుధవారం ఉదయం వరకు సైక్లోన్ ప్రభావం తీవ్రంగా ఉండి ఆ తర్వాత బలహీనపడే అవకాశం ఉందని వాతావరణ శాఖ ప్రకటించింది. ఐతే మైదానాన్ని కవర్లతో కప్పి ఉంచామని, మ్యాచ్ జరిగే రోజు ఉదయం వర్షం పడినా తక్కువ సమయంలోనే మ్యాచ్ నిర్వహణకు స్టేడియాన్ని సిద్ధం చేయగలమని సౌరాష్ట్ర క్రికెట్ సంఘం అధ్యక్షుడు జయ్‌దేవ్ షా వివరించాడు.

1986
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles