ఆఫ్గనిస్థాన్ 125 ఆలౌట్..

Sat,June 15, 2019 10:22 PM

afghnisthan 125 all out against south africa in world cup match

లండన్: కార్డిఫ్‌లోని సోఫియా గార్డెన్స్‌లో జరుగుతున్న ఐసీసీ క్రికెట్ వరల్డ్ కప్ 2019 టోర్నీ 21వ మ్యాచ్‌లో సౌతాఫ్రికా జట్టుపై ఆఫ్గనిస్థాన్ 34.1 ఓవర్లలో 125 పరుగులు చేసి ఆలౌట్ అయింది. టాస్ ఓడిపోయి బ్యాటింగ్‌కు దిగిన ఆఫ్గనిస్థాన్ జట్టులో రషీద్ ఖాన్ (25 బంతుల్లో 35 పరుగులు, 6 ఫోర్లు), నూర్ అలీ జద్రాన్ (58 బంతుల్లో 32 పరుగులు, 4 ఫోర్లు), హజ్రతుల్లా జజయ్ (23 బంతుల్లో 22 పరుగులు, 3 ఫోర్లు) తప్ప మిగిలిన బ్యాట్స్‌మెన్ ఎవరూ రెండంకెల స్కోరు కూడా చేయలేకపోయారు. కాగా సౌతాఫ్రికా బౌలర్లలో ఇమ్రాన్ తాహిర్ 4 వికెట్లు పడగొట్టగా, క్రిస్ మోరిస్ 3, పెహ్‌లుక్‌వాయో 2, రబాడా 1 వికెట్ తీశారు. అయితే మ్యాచ్ మధ్యలో పలు సార్లు వర్షం పడి ఆటకు అంతరాయం ఏర్పడడంతో ఇరు వైపులా 2 చొప్పున ఓవర్లను తగ్గించారు. దీంతో 48 ఓవర్లకు మ్యాచ్‌ను కుదించి తిరిగి ఆట ప్రారంభించారు.

2447
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles