టీ20ల్లో మ‌రో డ‌బుల్ సెంచ‌రీ!

Mon,July 10, 2017 01:10 PM

Afghanistans Shafiqullah Shafaq Hits Double Century in T20 Game

కాబూల్‌: టీ20 క్రికెట్‌లో సెంచ‌రీ చేయ‌డ‌మే గ‌గ‌నం. అలాంటిది డ‌బుల్ సెంచ‌రీ అంటే మాట‌లా? ఆఫ్ఘ‌నిస్థాన్ వికెట్ కీప‌ర్ ష‌ఫీకుల్లా ష‌ఫ‌క్ ఈ అరుదైన ఘ‌నత సాధించిన అతికొద్ది మంది ప్లేయ‌ర్స్‌లో ఒక‌డిగా నిలిచాడు. ఆఫ్ఘ‌న్‌లో స్థానికంగా జ‌రిగిన ప‌ర‌గాన్ నాన్‌గ‌ఢ‌ర్ చాంపియ‌న్ ట్రోఫీలో భాగంగా జ‌రిగిన మ్యాచ్‌లో ష‌ఫ‌క్‌.. కేవ‌లం 71 బంతుల్లో 214 ర‌న్స్ చేశాడు. అతని ఇన్నింగ్స్‌లో 21 సిక్స్‌లు, 16 ఫోర్లు ఉన్నాయి. దీంతో అత‌ని టీమ్ ఖ‌తీజ్ క్రికెట్ అకాడ‌మీ 20 ఓవ‌ర్ల‌లో 351 ప‌రుగుల భారీ స్కోరు సాధించింది. ప్ర‌త్య‌ర్థి జ‌ట్టు కాబూల్ స్టార్ క్రికెట్ క్ల‌బ్ కేవ‌లం 107 ర‌న్స్‌కే ఆలౌటైంది. ష‌ఫ‌క్‌.. గ‌త మూడు టీ20 (2012, 2014, 2016) వ‌ర‌ల్డ్‌క‌ప్‌ల‌లోనూ ఆఫ్ఘనిస్థాన్ త‌ర‌ఫున ప్రాతినిధ్యం వ‌హించాడు. అయితే అత‌ను ఇంట‌ర్నేష‌న‌ల్ క్రికెట్‌లో మాత్రం పెద్ద‌గా రాణించింది లేదు. ఇప్ప‌టివ‌ర‌కు 35 టీ20లు ఆడిన ష‌ఫ‌క్‌.. 392 ర‌న్స్ చేశాడు. అత్య‌ధిక స్కోరు 51 మాత్ర‌మే.

5728
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles