భారత్‌తో తొలి వన్డేకు ఆస్ట్రేలియా జ‌ట్టిదే..!

Fri,January 11, 2019 03:49 PM

Aaron Finch announces playing XI

సిడ్నీ: టీమిండియాతో తొలి వ‌న్డే కోసం ఆస్ట్రేలియా టీమ్‌ను ఆదేశ కెప్టెన్ అరోన్ పింఛ్ శుక్ర‌వారం ప్ర‌క‌టించాడు. సుదీర్ఘ విరామం సుమారు 8ఏండ్ల త‌ర్వాత పేస‌ర్ పీట‌ర్ సిడిల్ అనూహ్యంగా మ‌ళ్లీ జ‌ట్టులోకి వ‌చ్చాడు. సిడిల్ చివ‌రిసారిగా 2010లో శ్రీలంక‌తో వ‌న్డే మ్యాచ్ ఆడాడు. ఆసీస్ సార‌థి అరోన్ ఫించ్‌తో క‌లిసి వికెట్‌ కీపర్‌ అలెక్స్‌ కేరీ ఓపెన‌ర్‌గా బ‌రిలో దిగ‌నున్నాడు. ఈ ఏడాది బిగ్‌బాష్ లీగ్‌లో అద్భుతంగా రాణిస్తున్న కేరీకి బ్యాటింగ్ ఆర్డ‌ర్‌లో ప్ర‌మోష‌న్ ల‌భించింది. భార‌త్‌తో టెస్టు సిరీస్‌లో దారుణంగా విఫ‌ల‌మైన ఉస్మాన్ ఖ‌వాజా, షాన్ మార్ష్‌లు కూడా తుది జ‌ట్టులో చోటు ద‌క్కించుకున్నారు. సిడ్నీ వేదిక‌గా ఇరుజ‌ట్ల మ‌ధ్య శ‌నివారం తొలి వ‌న్డే ఆరంభంకానుంది.

ఆస్ట్రేలియా టీమ్‌: అరోన్ ఫించ్ (కెప్టెన్), అలెక్స్‌ కేరీ (వికెట్ కీపర్), ఉస్మాన్ ఖవాజా, షాన్ మార్ష్, పీటర్ హ్యాండ్స్‌కాంబ్ , మార్కస్ స్టాయినిస్, గ్లెన్ మాక్స్‌వెల్, పీటర్ సిడిల్, నాథన్ లైయన్, రిచర్డ్‌సన్, జాసన్ బెహ్రెండార్ఫ్

3939
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles