ఫుట్‌బాల్ అభిమానుల‌పైకి దూసుకెళ్లిన కారు..వీడియో

Sun,June 17, 2018 11:57 AM

A Taxi in Moscow ploughs into soccer fans

మాస్కో: ర‌ష్యా రాజ‌ధాని మాస్కోలోని రెడ్ స్క్వేర్‌లో ఫుట్‌బాల్ అభిమానుల మీదికి ఓ కారు దూసుకెళ్లింది. ఈ ప్ర‌మాదంలో ఏడుగురు గాయ‌పడ్డారు. వీళ్ల‌లో మెక్సికో టీమ్ అభిమానులు కూడా ఉన్నారు. వీళ్లంతా సాక‌ర్ వ‌ర‌ల్డ్‌క‌ప్ కోస‌మే ర‌ష్యా వ‌చ్చారు. కిర్గిస్థాన్ లైసెన్స్ ఉన్న ఆ ముస్లిం డ్రైవ‌ర్ సోవియ‌ట్ రిప‌బ్లిక్ మాజీ పౌరుడు. అయితే తాను కావాల‌ని జ‌నంపైకి కారును తీసుకెళ్ల‌లేదని అత‌డు చెప్పిన‌ట్లు పోలీసులు వెల్ల‌డించారు. మెక్సిక‌న్ జెర్సీలు ధ‌రించిన అభిమానుల‌పైకి ఈ కారు దూసుకెళ్లింద‌ని ప్ర‌త్య‌క్ష సాక్షులు తెలిపారు. ఆదివారం రోజు జ‌ర్మ‌నీతో త‌మ తొలి మ్యాచ్‌లో మెక్సికో త‌ల‌ప‌డ‌బోతున్న‌ది.

లుజ్నికి స్టేడియంలో జ‌రిగే ఈ మ్యాచ్ చూడ‌టానికే వేల మంది మెక్సికో అభిమానులు మాస్కో వ‌చ్చారు. ఈ ప్ర‌మాదం జ‌రిగిన త‌ర్వాత కారు డ్రైవ‌ర్ పారిపోవ‌డానికి ప్ర‌య‌త్నించ‌గా.. అక్క‌డున్న‌వాళ్లు ప‌ట్టుకొని పోలీసుల‌కు అప్ప‌గించార‌ని ఓ ప్ర‌త్య‌క్ష సాక్షి చెప్పాడు. అది నేను కాదు అని ఆ డ్రైవ‌ర్ అర‌చిన‌ట్లు ఆ వ్యక్తి తెలిపాడు. ఆ స‌మ‌యంలో అత‌ను మ‌ద్యం తాగిన‌ట్లు క‌నిపించ‌లేద‌ని అన్నాడు. గాయ‌ప‌డిన వాళ్లంతా కోలుకుంటున్నార‌ని, ఎవ‌రికీ అంత తీవ్ర‌మైన గాయాలు కాలేద‌ని ఇంట‌ర్‌ఫాక్స్ న్యూస్ ఏజెన్సీ వెల్ల‌డించింది. ఈ ఘ‌ట‌న త‌ర్వాత భ‌ద్ర‌త‌ను మ‌రింత పెంచారు.

1169
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles