కోహ్లీ కెప్టెన్సీలోనే 200 వికెట్లు..

Fri,August 3, 2018 05:19 PM

200 wickets for Ashwin under Kohlis captaincy

బర్మింగ్‌హోమ్: అంతర్జాతీయ క్రికెట్లో అత్యుత్తమ బౌలర్‌గా పేరొందిన భారత స్పిన్ మాంత్రికుడు రవిచంద్రన్ అశ్విన్ ఇంగ్లాండ్‌తో టెస్టు సిరీస్‌లో అదరగొట్టేస్తున్నాడు. అంచనాలకు మించి రాణిస్తూ ప్రత్యర్థి గడ్డపై అసాధారణ ప్రతిభ కనబరుస్తున్నాడు. విరాట్ కోహ్లీ సారథ్యంలో అశ్విన్ రికార్డులను కొల్లగొడుతున్నాడు. తాజాగా ఇంగ్లాండ్‌తో తొలి టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో మొదటి మూడు వికెట్లను యాష్ పడగొట్టిన విషయం తెలిసిందే. విరాట్ కోహ్లీ సారథ్యంలోనే అతడు 200 వికెట్లను తీసి మరో మైలురాయి అందుకున్నాడు. విరాట్ నేతృత్వంలో తక్కువ టెస్టుల్లో ఈ ఘనత అందుకోవడం విశేషం. ఇప్పటి వరకు 59 టెస్టులాడిన అశ్విన్ అత్యంత వేగంగా 323 వికెట్లు పడగొట్టాడు.

200 వికెట్ల వీరులు..

1. శ్రీలంక క్రికెటర్ సనత్ జయసూర్య కెప్టెన్సీలో మాజీ స్పిన్నర్ మురళీ ధరన్(30 మ్యాచ్‌లు) అతి తక్కువ టెస్టుల్లో ఈ రికార్డు నెలకొల్పాడు.
2. ఆస్ట్రేలియా ఆటగాడు రికీ పాంటింగ్ సారథ్యంలో మాజీ స్పిన్నర్ షేన్ వార్న్.. టీమిండియా సారథి విరాట్ కోహ్లీ కెప్టెన్సీలో అశ్విన్ 34 మ్యాచ్‌ల్లో ఈ ఘనత అందుకున్నారు.
3. వివ్ రిచర్డ్స్ సారథ్యంలో మాల్కమ్ మార్షల్.. సౌతాఫ్రికా మాజీ కెప్టెన్ హాన్సీ క్రోన్జే నేతృత్వంలో ఏ డొనాల్డ్.. దక్షిణాఫ్రికా మాజీ సారథి గ్రేమ్ స్మిత్ సారథ్యంలో డేల్ స్టెయిన్.. 40 మ్యాచ్‌ల్లో ఈ రికార్డును చేరుకున్నారు.

2913
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles