హై స్కోరింగ్ థ్రిల్ల‌ర్‌.. 12 సిక్స‌ర్లు - వీడియో

Mon,June 10, 2019 10:15 AM

12 sixers hit in Australia versus India match in World cup

హైద‌రాబాద్: ఆస్ట్రేలియాతో జ‌రిగిన హై స్కోరింగ్ థ్రిల్ల‌ర్‌లో ఇండియా నెగ్గిన విష‌యం తెలిసిందే. అయితే ఈ ఒక్క మ్యాచ్‌లోనే బ్యాట్స్‌మెన్లు 12 సిక్స‌ర్లు బాదారు. దాంట్లో ఇండియా ప్లేయ‌ర్లే 8 సిక్స‌ర్లు కొట్ట‌డం విశేషం. మొద‌ట బ్యాటింగ్ చేసిన ఇండియా నిర్ణీత 50 ఓవ‌ర్ల‌లో 5 వికెట్ల‌కు 352 ర‌న్స్ చేసింది. భారీ టార్గెట్‌తో బ‌రిలోకి దిగిన ఆసీస్ ట‌ఫ్ ఫైట్ ఇచ్చింది. ఆస్ట్రేలియా కూడా 300 మార్క్‌ను దాటింది. అయితే భారీ హిట్ట‌ర్లు ఉన్న ఆసీస్ టీమ్ ఈసారి సిక్స‌ర్లు బాద‌డంలో విఫ‌ల‌మైంది. ఆ జ‌ట్టు కేవ‌లం నాలుగు సిక్స‌ర్లు మాత్ర‌మే బాదింది. ఇండియ‌న్ ఇన్నింగ్స్‌లో పాండ్యా 3, కోహ్లీ 2 సిక్స‌ర్లు కొట్టారు. ధోనీ, రాహుల్‌, రోహిత్‌లు చెరో సిక్స‌ర్ త‌మ ఖాతాలో వేసుకున్నారు. ఇక ఆసీస్ జ‌ట్టు నుంచి ఫించ్‌, స్మిత్‌, ఖ‌వాహ‌జా, క్యారీలు ఒక్కొక్క సిక్స‌ర్ కొట్టారు. ఆస్ట్రేలియా 316 ర‌న్స్‌కు ఆలౌటైంది.2599
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles