ఐపీఎల్ వేలానికి 1,003 మంది క్రికెటర్లు..!

Wed,December 5, 2018 06:36 PM

1003 players, including 232 overseas cricketers register for IPL 2019 auction

న్యూఢిల్లీ: ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)-2019 వేలానికి మొత్తం 1003 మంది ఆటగాళ్లు వేలంలో పాల్గొనేందుకు తమ పేర్లను రిజస్టర్ చేసుకున్నారని బీసీసీఐ బుధవారం వెల్లడించింది. అందులో 232 మంది విదేశీ ఆటగాళ్లున్నారని వారంతా వేలంలో పాల్గొనేందుకు ఆసక్తి కనబర్చారని తెలిపింది. రాజస్థాన్‌లోని జైపూర్‌లో డిసెంబర్ 18న ఆటగాళ్ల వేలం జరగనుంది. ఆయా ఫ్రాంఛైజీలు ఇంకా 70 మంది ఆటగాళ్లను కొనుగోలు చేసుకునే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో 200 మంది అంతర్జాతీయ ఆటగాళ్లు..800మంది అన్‌క్యాప్‌డ్ ప్లేయర్స్‌తో పాటు ముగ్గురు అనుబంధ దేశాలకు చెందిన ఆటగాళ్లు పాల్గొంటున్నారు. 800 అన్‌క్యాప్‌డ్ ప్లేయర్స్‌లో 746 మంది ఆటగాళ్లు భారతీయులే కావడం విశేషం.

3786
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles