పాక్‌కు వెళ్లం.. తేల్చేసిన లంక క్రికెట‌ర్లు

Tue,September 10, 2019 08:33 AM

10 Sri Lankan players opted out of Pakistan tour over security concerns

హైద‌రాబాద్‌: పాకిస్థాన్‌తో జ‌రిగే టూర్‌లో పాల్గొనేందుకు లంక ప్లేయ‌ర్లు ఆస‌క్తి చూప‌డం లేదు. సుమారు ప‌ది మంది శ్రీలంక క్రికెట‌ర్లు పాక్‌కు వెళ్లేందుకు నిరాక‌రించారు. భ‌ద్ర‌తా కార‌ణాల దృష్ట్యా ఆ ప్లేయ‌ర్లంతా పాక్‌కు వెళ్ల‌డం లేద‌ని తెలిసింది. సెప్టెంబ‌ర్ 27 నుంచి అక్టోబ‌ర్ 9 వ‌ర‌కు పాక్‌తో లంక మూడు వ‌న్డేలు, మూడు టీ20లు ఆడాల్సి ఉంది. 2009లో లంక క్రికెట‌ర్ల‌పై పాక్‌లో ఉగ్ర‌దాడి జ‌రిగిన సంగ‌తి తెలిసిందే. ఆ ఘ‌ట‌న త‌ర్వాత పాక్‌లో ఇప్ప‌టివ‌ర‌కు అంత‌ర్జాతీయ క్రికెట్ మ్యాచ్‌లు జ‌ర‌గ‌లేదు. మ‌ళ్లీ లంక టీమ్‌తో పాక్‌లో క్రికెట్‌ను పున‌రుద్ధ‌రించాల‌ని భావిస్తున్నారు. కానీ ఆ దేశానికి ప్లేయ‌ర్ల‌ను పంపేముందు లంక బోర్డు స‌మావేశాన్ని ఏర్పాటు చేసింది. పాక్‌కు వెళ్ల‌వ‌ద్దు అనుకుంటే ప్లేయ‌ర్లు త‌మ అయిష్టాన్ని వ్య‌క్తం చేయ‌వ‌చ్చు అని బోర్డు చెప్పింది. కెప్టెన్ దిముత్ క‌రుణ‌ర‌త్నే, ల‌సిత్ మ‌లింగ‌, ఏంజిలో మాథ్యూస్ లాంటి ఆట‌గాళ్లు పాక్‌కు వెళ్లేందుకు నిరాక‌రించిన‌ట్లు తెలుస్తోంది. నిరోష‌న్ డిక్‌విల్లా, కుశ‌ల్ పెరీరా, ధ‌నంజ‌య డిసిల్వ‌, తిషార పెరీరా, అఖిల ధ‌నంజ‌య‌, సురంగ ల‌క్మ‌ల్‌, దినేశ్ చందీమ‌ల్ ప్లేయ‌ర్లు కూడా పాక్ టూర్ నుంచి త‌ప్పుకున్న లిస్టులో ఉన్నారు.2359
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles