తిమ్మారెడ్డిపల్లిలో రోడ్డు ప్రమాదం.. వ్యక్తికి తీవ్ర గాయాలు
కొండపాక : తిమ్మారెడ్డిపల్లి గ్రామ శివారులో ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. హైదరాబాద్కు చెందిన తులసీదాస్ తన కారులో హైదరాబాద్ నుంచి సిద్దిపేటకు బయలుదేరాడు. తిమ్మారెడ్డిపల్లి శివారులోకి చేరుకోగానే
కారు అదుపు తప్పి డివైడర్ను ఢీకొని అవతలి వైపునకు దూసుకెళ్లి పక్కన ఉన్న చెట్లను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారు తీవ్రంగా దెబ్బతిన్నది. కారును నడుపుతున్న తులసీదాస్ అందులోనే ఇరుక్కుపోయాడు. ప్రమాద విషయం తెలుసుకున్న హెచ్కేఆర్ రోడ్ వేస్ అంబులెన్స్ సిబ్బంది సుమారు గంటపాటు శ్రమించి కారులో నుంచి తులసీదాస్ ను బయటకు తీసి సిద్దిపేట ప్రభుత్వ దవాఖానకు తరలించారు.