e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Thursday, July 29, 2021
Home సిద్దిపేట పులకించిన పురిటిగడ్డ

పులకించిన పురిటిగడ్డ

 • సిద్దిపేటలో సీఎం కేసీఆర్‌కు ఘన స్వాగతం
పులకించిన పురిటిగడ్డ

సిద్దిపేట/ సిద్దిపేట అర్బన్‌/ సిద్దిపేట కలెక్టరేట్‌, జూన్‌ 20 : ఉద్యమాల పురిటిగడ్డ సిద్దిపేటకు చేరుకున్న సీఎం కేసీఆర్‌కు ప్రజాప్రతినిధులు, అధికారులు ఘనస్వాగతం పలికారు. హైదరాబాద్‌ నుంచి ప్రత్యేక హెలిక్యాప్టర్‌లో ఆదివారం సిద్దిపేట కలెక్టరేట్‌ ప్రాంగణానికి సీఎం చేరుకున్నారు. అక్కడి నుంచి మం త్రులు తన్నీరు హరీశ్‌రావు, వేముల ప్రశాంత్‌రెడ్డి, మహమూద్‌ అలీ, ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి, ఎమ్మెల్యేలు సతీశ్‌కుమార్‌, రసమయి బాలకిషన్‌, మాజీ ఎమ్మెల్సీ ఫారూఖ్‌ హుస్సేన్‌, కార్పొరేషన్‌ చైర్మన్లు గ్యాదరి బాలమల్లు, వంటేరు ప్రతాప్‌రెడ్డి, కలెక్టర్‌ వెంకట్రామ్‌రెడ్డితో కలిసి బస్సులో సిద్దిపేట పట్టణంలో నూతనంగా నిర్మించిన ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయానికి చేరుకుని సీఎం ప్రారంభించారు.

ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయాన్ని ప్రారంభించడానికి వస్తూ ఎదురుగా వచ్చిన తన చిన్నాన బాలకిషన్‌రావుకు పాదాభివందనం చేసి, ఆశీర్వాదం తీసుకున్నారు. ఆ తదుపరి పోలీసు కమిషనరేట్‌ ప్రారంభోత్సవానికి బయలుదేరిన సీఎం, కమిషనరేట్‌ వద్ద పోలీసుల గౌరవ వందనాన్ని స్వీకరించారు. పోలీస్‌ బ్యాండ్‌ మేళం ముఖ్యమంత్రికి స్వాగతం పలికారు. పోలీసు కమిషనరేట్‌ వద్ద హోంమంత్రి మహమూద్‌ అలీ, ఆర్‌అండ్‌బీ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ప్రత్యేక స్వాగతం పలికారు. మంత్రి హరీశ్‌రావు, డీజీపీ మహేందర్‌రెడ్డి, పోలీస్‌ హౌసింగ్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌ దామోదర్‌ గుప్త్తా, సీపీ జోయల్‌ డెవిస్‌తో కలిసి సీఎం కమిషనరేట్‌ను ప్రారంభించారు. సంప్రదాయ బద్ధంగా పూజా కార్యక్రమాలను నిర్వహించారు. పోలీసు కమిషనరేట్‌లో సీపీ జోయల్‌ డెవిస్‌ను సీఎం స్వయంగా కుర్చీలో కూర్చోబెట్టి శుభాకాంక్షలు తెలిపారు.

- Advertisement -

తర్వాత సీఎం మోమెంట్‌ రిజిష్టర్‌లో తొలి సంతకం చేశారు. పోలీసు కమిషనరేట్‌కు ఎదురుగా పోలీస్‌ అధికారులతో కలిసి గ్రూప్‌ ఫొటో దిగారు. అనంతరం అక్కడి నుంచి బస్సులో నూతన సమీకృత కలెక్టరేట్‌ భవన సముదాయాన్ని ప్రారంభించేందుకు వెళ్లారు. నూతన కలెక్టరేట్‌ వద్ద సీఎస్‌ సోమేశ్‌ కుమార్‌తో గమ్మడికాయ కొట్టించి, సీఎంవో కార్యదర్శి స్మితాసబర్వాల్‌తో కొబ్బరికాయ కొట్టించారు. కలెక్టరేట్‌ను సీఎస్‌ సోమేశ్‌ కుమార్‌ చేతుల మీదుగా ప్రారంభించారు. ప్రారంభోత్సవ కార్యక్రమలంతా సంప్రదాయబద్ధ్దంగా సాగాయి. వేద పండితులు సీఎం కేసీఆర్‌కు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. ఉదయం నుంచి సిద్దిపేటలో పర్యటించిన సీఎంకు అడుగడుగునా టీఆర్‌ఎస్‌ శ్రేణులు ఘనస్వాగతం పలికారు. హెలిక్యాప్టర్‌లో సిద్దిపేటకు వచ్చిన సీఎం అక్కడి కార్యక్రమాలు అయిపోగానే తిరిగి మళ్లీ హెలిక్యాప్టర్‌లోనే కామారెడ్డికి వెళ్లారు.

ప్రసంగం మధ్యమధ్యలో నవ్వులు పుయించిన సీఎం..
సిద్దిపేట నూతన సమీకృత కలెక్టరేట్‌లో సుమారు 91 నిమిషాల పాటు సీఎం కేసీఆర్‌ ప్రసంగించారు. ఏకదాటిన సాగిన సీఎం ప్రసంగంతో మధ్యమధ్యలో నవ్వులు పుయించారు. సామెతలు వేస్తూ అందరినీ కడుపుఉబ్బా నవ్వించారు. ప్రతిపక్ష పార్టీ నాయకులకు సామెతలతో చురుకులు అంటించారు. ‘గత పాలకులు చేసిందేమీ లేదంటూ… అప్పుడూ ఆగం ఆగం జగన్నతాం’.. అంటూ వ్యంగంగా మాట్లాడారు. రైతుబంధు పథకం రాష్ట్రంలో ఎలాంటి పైరవీలు లేకుండా టాన్‌.. టాన్‌ మంటూ రైతుల ఫోన్‌లకు మెసేజీలు వస్తున్నాయి. ఇందులో కొంతమంది అటూ ఇటూ పోతుర్రూ అనుకో.. కానీ, 95శాతం మంది రైతులకు సద్వినియోగం అవుతున్నదని సీఎం చెప్పగా.. అందరూ నవ్వారూ. తాను సిద్దిపేట ఎమ్మెల్యేగా ఉన్నప్పటి నాయకులందరిననీ గుర్తు చేశారు. అప్పటి పరిస్థితులను, కష్టాలను చెబుతూనే స్వరాష్ట్రం సాధించిన తదుపరి విజయాలను అందరికీ తన స్వీప్‌ ద్వారా వివరించారు. తాను చేసిన అభివృద్ధి, పట్టుదలను, సిద్దిపేట ప్రజల ఐక్యతను చాటి చెప్పారు.

సీఎం వెంట మంత్రులు మహమూద్‌ అలీ, వేముల ప్రశాంత్‌రెడ్డి, హరీశ్‌రావు, సీఎస్‌ సోమేశ్‌ కుమార్‌, సీఎంవో స్మితాసబర్వాల్‌, ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి, డీజీపీ మహేందర్‌రెడ్డి, అడిషనల్‌ డీజీపీ రవిగుప్తా, నిజామాబాద్‌ రేంజ్‌ ఐజీ శివశంకర్‌రెడ్డి, జడ్పీ చైర్‌పర్సన్‌ రోజాశర్మ, ఎమ్మెల్సీలు రఘోత్తంరెడ్డి, పారూఖ్‌ హుస్సేన్‌, ఎమ్మెల్యేలు రసమయి బాలకిషన్‌, సతీశ్‌కుమార్‌, ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి, రఘునందన్‌రావు, జిల్లా కలెక్టర్‌ వెంకట్రామ్‌రెడ్డి, తెలంగాణ సాహిత్య అకాడమీ చైర్మన్‌ నందిని సిధారెడ్డి రాష్ట్ర అటవీ అభివృద్ధి సంస్థ చైర్మన్‌ వంటేరు ప్రతాపరెడ్డి, రాష్ట్ర పౌరసరఫరాల సంస్థ చైర్మన్‌ మారెడ్డి శ్రీనివాస్‌రెడ్డి, రాష్ట్ర పరిశ్రమల మౌలిక సదుపాయాల సంస్థ చైర్మన్‌ గ్యాదరి బాలమల్లు, పోలీస్‌ హౌసింగ్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌ గుప్తా, రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ చైర్మన్‌ ఉప్పల శ్రీనివాస్‌ గుప్తా, ఎస్సీ, ఎస్టీ కమిషన్‌ చైర్మన్‌ ఎర్రోల్ల శ్రీనివాస్‌, సీఎంవో ఓఎస్డీ దేశపతి శ్రీనివాస్‌, డీసీసీబీ చైర్మన్‌ చిట్టి దేవేందర్‌రెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ ఛైర్మన్‌ లక్కిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి, రైతుబంధు సమితి జిల్లా అధ్యక్షుడు వంగనాగిరెడ్డి, మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ కడవేర్గు మంజుల రాజనర్సు, సుడా చైర్మన్‌ రవీందర్‌రెడ్డి, దుద్దెడ సర్పంచ్‌ అరెపల్లి మహదేవ్‌ తదితరులు పాల్గొన్నారు.

కడుపుబ్బా నవ్వించిన కరోనా ముచ్చట..
సిద్దిపేట కలెక్టరేట్‌ సమావేశ మందిరంలో సీఎం కేసీఆర్‌ ప్రసంగిస్తున్న సమయంలో కరోనా ప్రస్తావన వచ్చింది. రాష్ట్ర ప్రభుత్వం కరోనాను అరికట్టేందుకు నాలుగు సూపర్‌ స్పెషాలిటీ దవాఖానలు మంజూరు చేస్తున్నట్లుగా చెప్పారు. కరోనాతో నేడు మూతికో బట్ట కట్టుడూ.. పెండ్లీలకు వెళ్తే సార్‌ మాస్కు తీయి.. ఎందుకంటే.. సార్‌ మళ్లీ మీరు దొరకరూ.. ఫొటోల కోసం.. మాస్కు తీస్తే నీకు దొరుకుతా.. కానీ, కరోనాకు నేను దొరుకుతా.. కాదా.. అటూఇటూ తాకీ నాకు కూడా వచ్చింది కరోనా.. సీఎం అనగానే అక్కడున్న వారందరూ కడుపుబ్బా నవ్వారు.

సీఎం పర్యటన సైడ్‌ లైట్స్‌..

 • ఉదయం 11.54 గంటలకు హెలిక్యాప్టర్‌లో సీఎం సిద్దిపేట నూతన కలెక్టరేట్‌ భవన ఆవరణలో ఏర్పాటు చేసిన హెలిప్యాడ్‌లో దిగారు.
 • ఉదయం 11.58 గంటలకు సీఎం ప్రత్యేక బస్సులో ఎక్కారు.
 • మధ్యాహ్నం 12 గంటలకు రోడ్డు మార్గం ద్వారా సిద్దిపేట పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయానికి బయలుదేరారు.
 • మధ్యాహ్నం 12.10 గంటలకు సిద్దిపేట ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయానికి చేరుకున్న సీఎం కేసీఆర్‌ కాన్వాయ్‌
 • మధ్యాహ్నం 12.12 గంటలకు సీఎంకు పూర్ణకుంభంతో వేద మంత్రోచ్ఛారణలతో స్వాగతం పలికిన పురోహితులు, మంగళహారతితో స్వాగతం పలికిన సిద్దిపేట మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ కడవేర్గు మంజుల రాజనర్సు, కౌన్సిలర్లు
 • మధ్యాహ్నం 12.11గంటలకు తన చిన్నాన్న బాలకిషన్‌రావుకు పాదాభివందనం చేసి ఆశీర్వాదం తీసుకున్న సీఎం కేసీఆర్‌
 • మధ్యాహ్నం 12.16 గంటలకు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయ శిలాఫలకం ఆవిష్కరణ
 • మధ్యాహ్నం 12.17 గంటలకు రిబ్బన్‌ కట్‌చేసి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయాన్ని ప్రారంభించిన సీఎం కేసీఆర్‌
 • సిద్దిపేట పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయ ప్రారంభోత్సవానికి ప్రత్యేక బస్సులో మంత్రులు హరీశ్‌రావు, మహమూద్‌ అలీ, వేముల ప్రశాంత్‌రెడ్డి, సీఎస్‌ సోమేశ్‌ కుమార్‌, ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి, ఎమ్మెల్సీ ఫారూఖ్‌ హుస్సేన్‌, ఎమ్మెల్యేలు రసమయి బాలకిషన్‌, వొడితెల సతీశ్‌ కుమార్‌, రఘునందన్‌రావు, జడ్పీ చైర్‌పర్సన్‌ రోజాశర్మ, కలెక్టర్‌ వెంకట్రామ్‌రెడ్డి, కార్పొరేషన్‌ చైర్మన్లు గ్యాదరి బాలమల్లు, వంటేరు ప్రతాప్‌రెడ్డితో కలిసి సీఎం ప్రారంభించారు.
 • మధ్యాహ్నం 12.20 గంటలకు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయాన్ని పరిశీలించిన సీఎం కేసీఆర్‌
 • మధ్యాహ్నం 12.21 గంటలకు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన సభాస్థలికి చేరుకున్న సీఎం కేసీఆర్‌
 • మధ్యాహ్నం 12.22 గంటలకు ఈలలు, నినాదాలు, చప్పట్లతో మార్మోగిన సభా ప్రాంగణం, కార్యకర్తలు, ప్రజాప్రతినిధులకు అభివాదం చేస్తూ పలువురిని పలకరిస్తూ 12.28 గంటల వరకు సభాప్రాంగణంలో గడిపిన సీఎం కేసీఆర్‌. అభివాదం చేస్తున్న సమయంలో పలువురు కవులు పుస్తకాలు, కార్యకర్తలు పుష్పగుచ్ఛాలను అందజేశారు.
 • మధ్యాహ్నం 12.29 గంటలకు మున్సిపల్‌ పాలకవర్గ సభ్యులతో ఫొటో దిగిన సీఎం కేసీఆర్‌
 • మధ్యాహ్నం 12.30 గంటలకు ప్రత్యేక బస్సులో నూతన కలెక్టరేట్‌, కమిషనరేట్‌ ప్రారంభోత్సవానికి తిరిగి వెళ్లిన సీఎం కేసీఆర్‌.
 • ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం వద్ద సుమారు 15నిమిషాల పాటు సీఎం కేసీఆర్‌ ఉన్నారు.
 • సీఎం కేసీఆర్‌ కాన్వాయ్‌కి ఘన స్వాగతం పలికిన టీఆర్‌ఎస్‌ విద్యార్థి విభాగం నాయకులు
 • సీఎం అన్నీ కార్యాలయాల్లో కలియతిరిగారు.
 • పూజా కార్యక్రమంలో భాగంగా వేదపండితులకు స్వయంగా సీఎం కట్నాలను సమర్పించి, ఆశీర్వాదం తీసుకున్నారు.
 • ఉదయం 12.46 గంటలకు పోలీసు కమిషనరేట్‌ను సీఎం ప్రారంభించారు.
 • సుమారు 40 నిమిషాల పాటు సీపీ కార్యాలయంలో సీఎం ఉన్నారు.
 • 1.30 గంటలకు నూతన సమీకృత కలెక్టరేట్‌కు చేరుకున్న సీఎం.. మధ్యాహ్నం1.38 గంటలకు సీఎస్‌ సోమేశ్‌ కుమార్‌ చేతుల మీదుగా కలెక్టరేట్‌ భవన సముదాయాన్ని ప్రారంభించారు.
 • నూతన కలెక్టరేట్‌లో కలెక్టర్‌ కుటుంబసభ్యులు, సీపీ కార్యాలయంలో సీపీ కుటుంబసభ్యులతో సీఎం మాట్లాడి, వారితో కలిసి ఫొటోలు దిగారు.
 • 3.49 గంటల వరకు కలెక్టరేట్‌ సమావేశ మందిరంలో సీఎం ప్రసంగించారు.
 • 5.10 గంటలకు సిద్దిపేట కలెక్టరేట్‌ నుంచి కామారెడ్డి జిల్లా పర్యటనకు హెలిక్యాప్టర్‌లో బయలుదేరి వెళ్లారు.
Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
పులకించిన పురిటిగడ్డ
పులకించిన పురిటిగడ్డ
పులకించిన పురిటిగడ్డ

ట్రెండింగ్‌

Advertisement