e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Tuesday, June 15, 2021
Home సిద్దిపేట మహిళా సాధికారతకుప్రభుత్వం కృషి

మహిళా సాధికారతకుప్రభుత్వం కృషి

మహిళా సాధికారతకుప్రభుత్వం కృషి

నర్సాపూర్‌ రూరల్‌, మార్చి 25 : సమాజంలో మహిళల గౌరవానికి అందరూ కలిసి పనిచేయాలని, మహిళలు చట్టాల గురించి తెలుసుకోవాలని మహిళా కమిషన్‌ రాష్ట్ర చైర్‌పర్సన్‌ సునీతాలక్ష్మారెడ్డి అన్నారు. గురువారం నర్సాపూర్‌ పట్టణంలోని ఓ ప్రైవేట్‌ ఫంక్షన్‌ హాల్‌లో ఐసీడీఎస్‌ ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవానికి ఎమ్మెల్యే మదన్‌రెడ్డితో పాటు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రభుత్వం మహిళా సాధికారతకు కృషి చేస్తున్నదని వివరించారు. పట్టుదల, కృషి, నమ్మకం ఉంటే ఏదైనా సాధించవచ్చని మహిళలకు సూచించారు. షీ టీమ్స్‌, సఖీ కేంద్రాల ద్వారా మహిళలకు న్యాయం జరిగేలా ప్రభుత్వం పనిచేస్తుందని వెల్లడించారు. 181 టోల్‌ఫ్రీ నెంబర్‌ మహిళల రక్షణకు ఎంతగానో దోహదపడుతుందని చెప్పారు. మహిళల రక్షణకు జిల్లా స్థాయిలో ఐదుగురితో కమిటీని ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు.
మహిళల్లో చైతన్యం రావాలి -ఎమ్మెల్యే మదన్‌రెడ్డి
సమాజంలో జరుగుతున్న అన్యాయాలను ఎదుర్కోవడానికి మహిళల్లో చైతన్యం రావాలని ఎమ్మెల్యే మదన్‌రెడ్డి పేర్కొన్నారు. పాశ్చాత్య దేశాలలో పురుషులకు సమానంగా మహిళలు అన్ని రంగాల్లో రాణిస్తున్నారని, మన దేశంలో కూడా మహిళలు అలాగే తయారవ్వాలని కోరారు. అంగన్‌వాడీలపై బాధ్యత ఎంతగానో ఉందని, సక్రమంగా విధులు నిర్వర్తించి అభివృద్ధ్ది సాధించాలన్నారు. చిన్నారుల నృత్యం అందరిని ఆకట్టుకుంది. అనంతరం విశిష్ట సేవలు అందించిన ఐసీడీఎస్‌ సిబ్బందికి అతిథులు జ్ఞాపికను, ప్రశంసాపత్రాలను అందజేశారు. కార్యక్రమంలో సంగారెడ్డి జిల్లా న్యాయ సేవా సంస్థ సీనియర్‌ సివిల్‌ జడ్జి డా.ఆశాలత, మహిళా కమిషన్‌ కార్యదర్శి రసూల్‌ బీ, మహిళా శిశు సంక్షేమ శాఖ జిల్లా అధికారి పద్మ, డీఈవో రమేశ్‌కుమార్‌, అంకాలజిస్ట్‌ గీతనాగమణి, నర్సాపూర్‌ సీడీపీవో హేమభార్గవి, జడ్పీటీసీలు, ఎంపీపీ లు,సర్పంచ్‌లు, అంగన్‌వాడీ టీచర్లు, సూపర్‌వైజర్లు తదితరులు ఉన్నారు

క్రీడా స్ఫూర్తితో పోటీపడాలి : మహిళా కమిషన్‌ చైర్‌ పర్సన్‌ సునీతారెడ్డి
చిలిపిచెడ్‌, మార్చి 25 : క్రీడాకారులకు గెలుపోటములు సహజమని, క్రీడా స్ఫూర్తితో పోటీపడాలని మహిళా కమిషన్‌ రాష్ట్ర చైర్‌పర్సన్‌ సునీతారెడ్డి అన్నారు. గురువారం మండలంలోని అంతారం గ్రామంలో బంజారా యూ త్‌ ఆధ్వర్యంలో క్రికెట్‌ టోర్నమెంట్‌ను ప్రారంభించారు. ఆమె బ్యాట్‌ పట్టి ఇతరులను ఉత్తేజపరిచారు. కార్యక్రమంలో చిలిపిచెడ్‌, కౌడిపల్లి ఎంపీపీలు వినోదదుర్గారెడ్డి, రాజునాయక్‌, సర్పంచ్‌ అశోక్‌గౌడ్‌, సొసైటీ వైస్‌ చైర్మన్‌ రాంచంద్రారెడ్డి, ఎంపీటీసీ ప్రవీణ్‌గౌడ్‌, టీఆర్‌ఎస్‌ కౌడిపల్లి మండల అధ్యక్షుడు రామాగౌడ్‌, మాణిక్యరెడ్డి, దుర్గారెడ్డి, యువకులు పాల్గొన్నారు.

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
మహిళా సాధికారతకుప్రభుత్వం కృషి

ట్రెండింగ్‌

Advertisement