e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Sunday, June 20, 2021
Home సిద్దిపేట ఆపదవేళ అమృతహస్తాలు

ఆపదవేళ అమృతహస్తాలు

ఆపదవేళ అమృతహస్తాలు

సిద్దిపేట జోన్‌, మే 21 : పట్టణంలో కరోనా బాధితులకు ఉచిత భోజనం అందిస్తున్న తీరును శుక్రవారం మున్సిపల్‌ కమిషనర్‌ రమణాచారి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడు తూ.. కరోనా వేళ అక్షయపాత్ర ద్వారా రూ. 5 భోజన శాలలను మూసివేశారన్నారు. స్వచ్ఛంద సంస్థలు, దాతలు కరోనా బాధితులకు ఉచితంగా భోజనం అందించడం అభినందనీయమన్నారు. మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ మంజులా రాజనర్సు, నారిసేన ఫ్రీఫుడ్‌ (గోపులాపురం దీప్తి), అమ్మ సహాయం హెల్పింగ్‌ హ్యాండ్స్‌, విశ్వహిం దూ పరిషత్‌, సత్యసాయి సేవా సమితి కొండపాక వారు ఉచితం గా భోజనం అందిస్తున్నారన్నారు. 24వ వార్డులో మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ నిర్వహిస్తున్న ఉచిత భోజనానికి మంచి స్పందన వచ్చిందని, మొత్తం 300 మందికి భోజనం అందిస్తున్నారన్నారు.

కరోనా బాధితులకు ఆహారం అందజేత
వజ్ర ఫౌండేషన్‌, కరోనా నివారణ కమిటీ ఆధ్వర్యంలో కరోనా బాధితులు, సహాయకులకు సిద్దిపేట ప్రభుత్వ దవాఖాన వద్ద ఆహారాన్ని అందజేశారు. రెండు రోజులుగా మధ్యాహ్న సమయాల్లో ఆహారం అందిస్తున్నామని కమిటీ సభ్యులు వెంకటేశం, పుల్లయ్య, వెంకట్‌గౌడ్‌, యాదగిరి తెలిపారు.

నిత్యావసర సరుకులు పంపిణీ
మండలంలోని గుర్రాలగొంది లో బాలవికాస సంస్థ ఆధ్వర్యంలో కరోనా బాధిత కుటుంబాలకు సర్పంచ్‌ శాతరాజుపల్లి ఆధ్వర్యంలో నిత్యావసర సరుకులు పం పిణీ చేశారు. అనంతరం గ్రామపంచాయతీ సిబ్బందికి వాకీటాకీలను పంపిణీ చేశారు. డాక్టర్‌ రఘురాం ఉషాలక్ష్మీ ఫౌండేషన్‌ హై దరాబాద్‌ సహకారంతో గ్రామస్తులకు మాస్క్‌లు పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఎంపీటీసీ ఆకుల హరీశ్‌, గ్రామ కార్యదర్శి అరుణ, ఏఎన్‌ఎం నిర్మల, ఉప సర్పంచ్‌ సంజీవరెడ్డి పాల్గొన్నారు.

అండగా ఉండడం అభినందనీయం
కరోనా బాధితులకు బాలవికాస సంస్థ అండ గా ఉండడం అభినందనీయమని ఎంపీపీ లింగాల నిర్మల అన్నా రు. మండలంలోని బెజ్జంకి, చీలాపూర్‌, తోటపల్లి, కల్లెపల్లిలో బాలవికాస ఆధ్వర్యంలో సోపర్‌ కెనడా వారి సహకారంతో నిత్యావసర సరుకులను జడ్పీటీసీ కనగండ్ల కవితతో కలిసి అందజేశారు. అనంతరం హరితహారంలో నాటిన మొక్కలు ఎండిపోకుండా నీరు పోసి సంరక్షించాలని కోరారు. ఈ సందర్భంగా ఉపాధి కూలీలకు మాస్క్‌లను పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఎంపీడీవో రాఘువేందర్‌రెడ్డి, సర్పంచ్‌లు దారం లక్ష్మి, ద్యావనపల్లి మంజుల, బోయినిపల్లి నర్సింగరావు, రావుల మొండయ్య పాల్గొన్నారు.

జర్నలిస్టుల సేవలు వెలకట్టలేనివి
జర్నలిస్టుల సేవలు వెలకట్టలేనివని సామాజిక సేవకురాలు కర్ణకంటి మంజులారెడ్డి అన్నారు. లాక్‌డౌన్‌ నేపథ్యంలో మండలకేంద్రంలో జర్నలిస్టులకు 25కిలోల బియ్యం, నిత్యావసర సరుకులు అందజేశారు. అనంతరం అక్కన్నపేటలోని శివాలయాన్ని దర్శించుకొని, పూజలు చేశారు. కార్యక్రమంలో జర్నలిస్టులు మార్క రమేశ్‌, నారదాసు ఈశ్వర్‌, పిడిశెట్టి కుమార్‌, వెంకటేశ్వర్లు, మోహన్‌, తిరుపతి, యువకులు దీపక్‌, రవీందర్‌రెడ్డి, సురేశ్‌గౌడ్‌, శ్రవణ్‌, సాయి, కిరణ్‌ తదితరులు ఉన్నారు.

పారిశుధ్య కార్మికులకు సరుకుల పంపిణీ
మండలంలోని సముద్రాల గ్రామంలో గ్రామపంచాయతీ సిబ్బందికి నిత్యావసర సరుకులను ఉపసర్పంచ్‌ వంగర ముకుందారెడ్డి పంపిణీ చేశారు.

పందిల్లలో నిత్యావసర వస్తువులు..
మండలంలోని పందిల్ల గ్రామం లో కరోనా బాధిత కుటుంబాలకు బాలవికాస సంస్థ ఆధ్వర్యంలో నిత్యావసర వస్తువులను అందచేశారు. కార్యక్రమంలో సర్పంచ్‌ తోడేటి రమేశ్‌, బాలవికాస ప్రతినిధులు జ్యోతి, నిర్మల, సెక్రటరీ శ్రీను, అంగన్‌వాడీ శారద, సుగుణ, ప్రభాకర్‌రెడ్డి పాల్గొన్నారు.

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
ఆపదవేళ అమృతహస్తాలు

ట్రెండింగ్‌

Advertisement