e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Monday, June 21, 2021
Home సిద్దిపేట అభివృద్ధికి కేరాఫ్‌ జంగపల్లి

అభివృద్ధికి కేరాఫ్‌ జంగపల్లి

అభివృద్ధికి కేరాఫ్‌ జంగపల్లి

మిరుదొడ్డి, దుబ్బాక, మే 20: అభివృద్ధికి ఆమడ దూరంలో ఉన్న మారుమూల గ్రామం జంగపల్లి ఇప్పుడు కొత్తరూపును సంతరించుకుంది. పల్లెప్రగతితో ఈ గ్రామం అన్నిరంగాల్లో అభివృద్ధి దిశగా పయనిస్తున్నది. రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మంగా ప్రవేశ పెట్టిన ‘పల్లె ప్రగతి’ పథకంలో ముందున్న జంగపల్లి గ్రామంపై అందిస్తున్న ప్రత్యేక కథనం..

జంగపల్లి గ్రామంలో పాడుబడిన బావులు 12, శిథిలావస్థలో ఉన్న 32 ఇడ్లను జేసీబీలు, ట్రాక్టర్ల ద్వారా రూ.1.20 లక్షల నిధులను వెచ్చించి పాత ఇండ్లను తొలగించారు. పాత బావులను మట్టితో పూడ్చి వేసి గ్రామాన్ని పరిశుభ్రంగా తీర్చిదిద్దారు.

గ్రామంలోని జనాభా, ఓటర్లు
జంగపల్లి గ్రామంలో 10 వార్డుల్లో మొత్తం జనాభా 2,092 మంది ఉండగా, అందులో ఓటర్లు 1,514 ఉనారు. పురుఝ ఓటర్లు, 732 మంది, మహిళా ఓటర్లు 782 మంది ఉన్నారు. గ్రామస్తులకు ‘మిషన్‌ భగీరథ’ పథకంలో స్వచ్ఛమైన తాగునీటిని అందించడానికి 3 ఓహెచ్‌ఆర్‌ ట్యాంకులు నిర్మించారు. 516 నల్లా కనెక్షన్లు బిగించారు. 410 మంది తమ ఇండ్లలో మరుగుదొడ్లను నిర్మించుకున్నారు. గ్రామంలో 560 మంది లబ్ధిదారులకు ఆసరా కింద సామాజిక పింఛన్లు అందుతున్నాయి.

సీసీ రోడ్లతో మట్టి రోడ్లకు చెక్‌
వాన కాలం వస్తే చాలు చిత్తడి వానకే వీధులన్నీ బురదమయంగా మారేవి.రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసిన రూ.25 లక్షలతో 3, 5, 7, 8, 9, 10 వార్డుల్లో సీసీ రోడ్లను నిర్మించారు. రూ.15 లక్షల నిధులతో వైకుఠధామాన్ని నిర్మాంచారు. రూ.2.20 లక్షల నిధులతో డంపింగ్‌ షెడ్‌ , గ్రామస్తులకు ఆహ్లాదకరమైన వాతావరణాన్ని అందించడానికి రూ.2 లక్షలతో పల్లె ప్రకృతి వనాన్ని నిర్మించారు. ఇప్పటి వరకు రూ.63.40 లక్షల నిధులతో జంగపల్లిలో అభివృద్ధి పనులు చేపట్టారు.

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
అభివృద్ధికి కేరాఫ్‌ జంగపల్లి

ట్రెండింగ్‌

Advertisement