e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Tuesday, June 15, 2021
Home సిద్దిపేట 10 రోజుల్లో ధాన్యం కొనుగోళ్లు పూర్తి

10 రోజుల్లో ధాన్యం కొనుగోళ్లు పూర్తి

10 రోజుల్లో ధాన్యం కొనుగోళ్లు పూర్తి

గజ్వేల్‌ అర్బన్‌, మే 20 : నియోజకవర్గ వ్యాప్తంగా మరో పది రోజుల్లో ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియ పూర్తి చేస్తామని ఎఫ్‌డీసీ చైర్మన్‌ వంటేరు ప్రతాప్‌రెడ్డి అన్నారు. గురువారం గజ్వేల్‌ మార్కెట్‌ యార్డులో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా ఎఫ్‌డీసీ చైర్మన్‌ ప్రతాప్‌రెడ్డి మాట్లాడుతూ.. గజ్వేల్‌ నియోజకవర్గ వ్యాప్తంగా 64 కొనుగోలు కేంద్రాల ద్వారా ప్రభుత్వం రైతుల నుంచి ధాన్యం కొనుగోలు చేస్తున్నదన్నారు. ఇప్పటివరకు 2లక్షల 63వేల క్వింటాళ్ల ధాన్యాన్ని కొనుగోలు చేశామన్నారు. మంత్రి హరీశ్‌రావు, కలెక్టర్‌ వెంకట్రామ్‌రెడ్డి ఎప్పటికప్పుడు అధికారులు, కొనుగోలు కేంద్రాల సిబ్బందితో టెలీకాన్ఫరెన్స్‌ నిర్వహిస్తూ కొనుగోలు ప్రక్రియను వేగవంతం చేస్తున్నారని వివరించారు. అధికార యంత్రాంగంతోపాటు ప్రజాప్రతినిధులు గ్రామాల్లో బాగా పని చేస్తున్నారని అభినందించారు. రైతులు పండించిన ప్రతి గింజనూ ప్రభుత్వం కొనుగోలు చేస్తుందన్నారు. ధాన్యం కొనుగోళ్లకు ప్రభుత్వం రూ.26 వేల కోట్లను కేటాయించినట్లు తెలిపారు. కార్యక్రమంలో మున్సిపల్‌ చైర్మన్‌ రాజమౌళి, వైస్‌ చైర్మన్‌ జకీయొద్దీన్‌, టీఆర్‌ఎస్వీ ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు మాదాసు శ్రీనివాస్‌, టీఆర్‌ఎస్‌ నాయకులు రవి, శ్రీనివాస్‌, అహ్మద్‌, స్వామి, అధికారులు, రైతులు పాల్గొన్నారు.

రైతులకు మద్దతు ధర : డీఆర్‌డీవో గోపాల్‌రావు
రాయపోల్‌, మే 20 : రైతులకు మద్దతు ధర కల్పించేం దుకే ప్రభుత్వం గ్రామాల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసిందని డీఆర్‌డీవో గోపాల్‌రావు అన్నారు. రాయ పోల్‌తోపాటు గ్రామల్లోని ఐకేపీ ధాన్యం కొనుగోలు కేంద్రాల ను ఆయన పరిశీలించి, రైతులతో మాట్లాడి సమస్యలను అడి గి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కొనుగోలు కేంద్రాల్లో రైతులకు ఇబ్బందులు లేకుండా అన్ని చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. రైతులు పండించిన పంటల కు మద్దతు ధర వచ్చే విధంగా ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసింద న్నారు. కొనుగోలు కేంద్రాల్లో రైతులకు సరి పడే విధంగా గోనే సంచులు అందుబాటు లో ఉన్నాయని చెప్పారు. ధాన్యం విక్రయిం చిన 72 గంటల్లో వారి ఖాతాలో డబ్బులు జమ అవుతాయని తెలిపారు. అనంతరం ఆయా గ్రామాల్లోని పంచాయతీ నర్సరీలను ఆయన పరిశీలించారు. డీఆర్‌డీవో వెంట ఎంపీవో శ్రీనివాస్‌, ఉపాధిహామీ టీఏ నర్సింహారెడ్డి, ఐకేపీ ఏపీఎం దుర్గయ్య ఉన్నారు.

తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేస్తాం..

  • ఏఎంసీ చైర్‌పర్సన్‌ అన్నపూర్ణ
    గజ్వేల్‌ అర్బన్‌, మే 20 : వర్షానికి తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని, రైతులు అధైర్యపడొద్దని గజ్వేల్‌ వ్యవసాయ మార్కెట్‌ చైర్‌పర్సన్‌ అన్నపూర్ణ అన్నారు. తన కార్యాలయంలో ఆమె మాట్లాడుతూ.. ప్రభుత్వం రైతు సంక్షేమానికి కట్టుబడి ఉందన్నారు. తడిసిన ధాన్యాన్ని కొను గోలు కేంద్రాల్లో కొనుగోలు చేస్తారని, రైతులు భయాందోళన తో ధాన్యాన్ని తక్కువ ధరకు అమ్ముకోవద్దని, పూర్తి స్థాయిలో ధాన్యం కొనుగోళ్లు అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు.

అప్రమత్తంగా ఉండాలి : డీసీవో అమృతసేనారెడ్డి
చేర్యాల, మే 20 : తుఫాన్‌ ముప్పు పొంచి ఉన్న నేపథ్యంలో కొనుగోలు కేంద్రాలకు ధాన్యం తీసుకొచ్చిన రైతులు అప్రమత్తంగా ఉండాలని డీసీవో అమృతసేనారెడ్డి, పీఏసీఎస్‌ చైర్మన్‌ వంగా చంద్రారెడ్డి సూచించారు. మండలంలోని కడవేర్గు, చేర్యాల మార్కెట్‌ యార్డులోని కొనుగోలు కేంద్రాలను మార్కె ట్‌ వైస్‌ చైర్మన్‌ పుర్మ వెంకట్‌రెడ్డి, ఎంపీడీవో తారిఖ్‌ అన్వర్‌తో కలిసి సందర్శించారు. ఈ సందర్భంగా వారు రైతులకు గన్నీ బ్యాగులు అందజేశారు. వర్షాలు పడే అవకాశం ఉన్నందున రైతులు ధాన్యం కుప్పలపై టార్పాలిన్లు కప్పుకోవాలని సూచించారు. వారి వెంట పీఏసీఎస్‌ వైస్‌ చైర్మన్‌ తాళ్లపల్లి నర్సయ్య, మార్కెట్‌ డైరెక్టర్‌ కర్రోళ్ల ఎల్లిషా, టీఆర్‌ఎస్‌ నేతలు అనంతుల మల్లేశం, ఆరుట్ల బాలయ్య ఉన్నారు.

రైతులకు ప్రభుత్వం అండగా ఉంటుంది
మిరుదొడ్డి, మే 20 : రాష్ట్రంలో రైతు ప్రభుత్వం కొనసాగుతుందని ఎంపీపీ గజ్జెల సాయిలు, పీఏసీఎస్‌ చైర్మన్‌ డీసీసీబీ డైరెక్టర్‌ బక్కి వెంటకయ్య అన్నారు. మిరుదొడ్డి మండల కేంద్రంతోపాటు అల్వాల, చెప్యాలా, లింగుపల్లి, అక్బర్‌పేట, కాసులాబాద్‌ గ్రామాల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాలను సం దర్శించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. పండించిన ప్రతి గింజనూ ప్రభుత్వం కొనుగోలు చేస్తుందన్నారు. రైతులు అధైర్యపడొద్దన్నారు. వారి వెంట టీఆర్‌ఎస్‌ సీనియర్‌ నాయకుడు లింగం, సర్పంచ్‌ల ఫోరం అధ్యక్షుడు తుమ్మల బాలరాజు, మాజీ ఎంపీపీ భాస్కరాచారి, నాయకులు బలిజే రమేశ్‌, స్వామి, బొమ్మ రాజయ్య తదితరులు పాల్గొన్నారు.

రైతులు అధైర్యపడొద్దు: తహసీల్దార్‌ అరుణ
దౌల్తాబాద్‌, మే 20 : రైతులు ఎవరూ అధైర్య పడవొద్దని, ప్రతి గింజనూ కొనుగోలు చేస్తామని తహసీల్దార్‌ అరుణ అన్నారు. మండలకేంద్రంలోని మార్కెట్‌ యార్డులో ధాన్యా న్ని కొనుగోళ్లను పరిశీలించారు. ఈ సందర్భంగా తహసీల్దార్‌ మాట్లాడుతూ.. అకాల వర్షానికి తడిసిన ధా న్యాన్ని కూడా కొనుగోలు చేస్తున్నట్లు తెలి పారు. రైతులకు ఇబ్బందులు తల్తెకుండా ధాన్యాన్ని వెనువెంటనే మిల్లులకు తరలించాలని, వచ్చిన ధాన్యాన్ని అన్‌లోడింగ్‌ చేయించాలని రైస్‌ మిల్లుల యజమానులకు సూచించారు. తహసీల్దార్‌ వెంట ఆర్‌ఐ ప్రభాకర్‌రావు తదితరులు ఉన్నారు.

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
10 రోజుల్లో ధాన్యం కొనుగోళ్లు పూర్తి

ట్రెండింగ్‌

Advertisement