ఆలోచన ఎంతో దండిగుంది..
తన కోసం గాదు.
తరతరాల శ్వాస కోసమై ముందడుగేసిన సాహసం
కండ్లళ్ల తిరుగుతూ
ప్రతి గడపలో హరితహార
నినాదమై మొలకెత్తింది.
చేయి చేయి కలిపిన
జనుల మమకారం
చిన్న, పెద్దలై పలుగు పారతో కదిలి
గుంతల్లో మొక్కలు మట్టిని ముద్దాడగా..
చుట్టు కంచెలు రక్షణ కవచాలై
నిలిచిన చోట
వరుణుడే కరుణించి జీవం పోయడా..!
అకుంఠిత దీక్షకు అందరి మనసు సాయమయ్యేలా
ఉద్యోగ, ప్రతినిధులంతా జైకొట్టి ముందడుగేసి
ఆర్థిక భరోసా కల్పించిన వేళ
హరితనిధికి ఆజ్యం పోసి
ఆపన్న హస్తంతో చేసిన సాయం
ఎన్నటికీ చెక్కుచెదరదు.
ప్రకృతికి సేవ చేస్తే పది కాలాలకు
జీవం పోసేలా
మొక్కల సంరక్షణే సంకల్పంగా మారుతున్నది.
రేయింబవళ్లు కష్టించిన ఆశయాన
బంగారు తెలంగాణ ఒడిన
పచ్చల హారమై పండ్ల చెట్లతో..
జంతుజాల సహవాసంతో ఊర్లలో
చేరిన కోతుల గుంపులు గో బ్యాక్ నినాదమై
చెట్టు చేమతో నేడు ఆటవిక
సంపద జీవులకు నేస్తమైతది.
పల్లె, పట్నమంతటా స్వచ్ఛమైన ఆక్సిజన్ పలకరిస్తుండగా..
మొక్కలు పెంచిన చేతులతో
చెట్లను కొట్టడం సాధ్యమైనా..!
ప్రగతి పథం సాగిన చోట అభివృద్ధిని ఆపతరమా..
స్వచ్ఛ బాటలైన మాగాణిలో
మన చుట్టూ పచ్చదనం నెలవు
తెలంగాణ రాష్ట్రమంతా
పూల బాటల సొబగు..!
కవి ఉండ్రాళ్ల రాజేశం
9966946084
(సిద్దిపేట)